ధనుష్ తో కృతిసనన్ ఇంటిమేట్ సీన్లా?
కోలీవుడ్ స్టార్ ధనుష్- ఆనంద్ ఎల్ రాయ్ మూడవ చిత్రానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ ధనుష్- ఆనంద్ ఎల్ రాయ్ మూడవ చిత్రానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కాంబోలో రిలీజ్ అయిన `రాంఝానా`, `ఆంత్రంగిరే` సంచలనం విజయాలు సాధించడంతో? బాలీవుడ్ లో ధనుష్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో మళ్లీ ఐదేళ్ల తర్వాత మచ్చటగా మూడవసారి చేతులు కలుపుతున్నారు. ఇప్పటికే సినిమా టైటిల్ ఫిక్స్ అయింది. `తేరే ఇష్క్ మే` అనే టైటిల్ ని ప్రకటించారు.
ప్రేమలో విఫలమైన ఓ యువకుడి కథ ఆధారంగా తీస్తున్నారు. ఇందులో ఆ యువకుడి పాత్రలో ధనుష్ నటిస్తున్నాడు. కథలో బలమైన ఎమోషన్ తో పాటు అంతకు మించి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని సమాచారం. దీంతో ధనుష్ ఈసారి కాస్త కండీషన్లు లేకుండానే నటించాల్సి ఉందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. స్టోరీ డిమాండ్ మేరకు ఆనంద్ ఎల్ రాయ్ ఈసారి ఇంటిమేట్ సన్నివేశాల జోలికి సైతం వెళ్తున్నాడుట.
ధనుష తో ఆనంద్ తీసిన రెండు సినిమాల విషయంలో రొమాంటిక్ అంశాలు ఎక్కడా టచ్ చేయలేదు. ఆ స్టోరీ లు డిమాండ్ చేయకపోవడంతో వాటి జోలికి ఆనంద్ వెళ్లలేదు. కానీ `తేరే ఇష్క్ మే` మాత్రం రొమాంటిక్ సన్నివేశాల్ని డిమాండ్ చేయడంతో కొన్ని ఇంటిమేజ్ సన్నివేశాలు కూడా రాసారుట. వాటిలో ధనుష్ తప్పక నటించాల్సిందే అంటున్నారు. ఇందులో ధనష్ కి జోడీగా కృతిసనన్ ని హీరోయిన్ గా తీసుకున్నారు.
అంటే ధనుష్ తో కలిసి ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించాల్సింది ఆమెనని తెలుస్తోంది. ధనుష్ దర్శకుల హీరో. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఆన్ స్క్రీన్ పై రొమాంటిక్ సన్నివేశాలు అతడు కెరీర్ లో ఇంతవరకూ పెద్దగా చేసింది లేదు. పెర్పార్మెన్స్ తోనే రాణించే నటుడు. కానీ ఈసారి రాయ్ కోసం రాజీ పడాల్సిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.