ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్న కృతి

కృతి సనన్‌ సినీ రంగ ప్రవేశం చేసి పదేళ్లు పూర్తి చేసుకుంది.

Update: 2024-08-24 10:30 GMT

మహేష్ బాబు హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొంది 2014 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన '1 నేనొక్కడినే' సినిమా తో సినీ రంగంలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కృతిసనన్‌. తెలుగు లో ఈమెకి మొదటి సినిమాతోనే నిరాశ ఎదురైంది. ఆ తర్వాత చేసిన తెలుగు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయాలను సొంతం చేసుకోలేక పోయాయి. దాంతో ఈమె కెరీర్‌ లో ఎదగడం కష్టమే అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా బాలీవుడ్‌ నుంచి ఈ అమ్మడికి మంచి ఆఫర్లు లభించాయి. కెరీర్‌ ఆరంభంలో చిన్న చిన్న హిందీ సినిమాల్లో నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్స్ కి మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా వరుసగా సినిమాల్లో నటిస్తోంది.

కృతి సనన్‌ సినీ రంగ ప్రవేశం చేసి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా ఒక మీడియా చిట్ చాట్‌ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా రిలేషన్‌ షిప్‌ గురించి కృతి సనన్ మాట్లాడుతూ... ఏ రిలేషన్‌ లో అయినా చిన్న చిన్న గొడవలు అనేవి చాలా సహజం. అయితే గొడవ జరిగినప్పుడు నా తప్పు ఉంటే నేనే ముందు క్షమాపణలు చెబుతాను. నా తప్పు లేనప్పుడు క్షమాపణలు చెప్పను. అయితే ఏదో విధంగా గొడవను పరిష్కరించుకుంటాను. అంతే తప్ప ఆ గొడవను మళ్లీ మళ్లీ పెద్దగా అయ్యే విధంగా పెంచుకోను.

ఏ సమస్య అయినా అలాగే వదిలేస్తే పెద్దది అవుతుంది. అందుకే ఏదో విధంగా సమస్యను పరిస్కరించుకుని, రిలేషన్‌ ను కొనసాగించాలని భావిస్తాను. ప్రతి చిన్న విషయానికి కన్నీళ్లు పెట్టుకోను. అయితే ఎవరితో అయినా గొడవ పడితే కోపంతో నాకు కన్నీళ్లు వస్తాయి. నా బాధ కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తుంది. సినిమా అంటే నాకు చాలా ఇష్టం, సాధ్యం అయినంత ఎక్కువ కాలం ఇండస్ట్రీలోనే కొనసాగుతాను, అవకాశాలు వచ్చేంత వరకు నటిస్తూనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది.

రిలేషన్‌ షిప్ విషయంలో కొందరు క్లారిటీ లేక పోవడంతో విడిపోవడం, బ్రేకప్ అవ్వడం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చాలా మంది భార్య భర్తలు చిన్న చిన్న గొడవలకు విడాకులు తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి వారికి కృతి సనన్‌ చెప్పిన సారి సలహా సరిగ్గా పని చేస్తుంది. ఆమె తన రిలేషన్ షిప్‌ ను చక్కగా కొనసాగించడం కోసం చాలా క్లారిటీ గా ఉందని అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో కృతి సనన్‌ రిలేషన్‌షిప్ గురించి చేసిన వ్యాఖ్యలు, ఆమె తన తప్పు ఉంటే క్షమాపణ చెప్పేందుకు సిద్ధం అంటూ చెప్పిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు.

Tags:    

Similar News