జీన్స్ లో కృతి స్టన్నింగ్.. మైండ్ బ్లాకే!

ఆ తర్వాత నాగచైతన్య దోచేయ్ మూవీలో యాక్ట్ చేయగా.. అది కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

Update: 2024-04-16 16:34 GMT

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. బీటౌన్ లో టాప్ హీరోయిన్ గా తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు వన్ నేనొక్కడినే మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయినా.. నటన పరంగా పర్వాలేదనిపించుకుంది కృతి. ఆ తర్వాత నాగచైతన్య దోచేయ్ మూవీలో యాక్ట్ చేయగా.. అది కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.


దీంతో బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది కృతి. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ బిజీగా గడుపుతోంది. గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా.. లేడీ ఓరియంటెడ్, ఛాలెంజింగ్ పాత్రలు చేస్తూ విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటోంది. గత ఏడాది తెలుగులో ఆదిపురుష్ మూవీతో పలకరించింది. ఈ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ అమ్మడు.. ఇటీవల క్రూ మూవీతో సక్సెస్ అందుకుంది.

ఈ చిత్రంలో కృతి సనన్ తో పాటు స్టార్ నటీనటులు కరీనా కపూర్, టబు, దల్జిత్ దోసాన్జ్, కపిల్ శర్మ కూడా లీడ్ రోల్స్ పోషించారు. ఇటీవల ఈ మూవీ సక్సెస్ పార్టీలో ట్రెండీ డ్రెస్ లో మెరిసిన కృతి.. తాజాగా Elle మ్యాగ్ జైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చింది. డెనిమ్ జీన్ జాకెట్ తో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. హెయిర్ లీవ్ చేసి తన చూపుతో అందరినీ ఫిదా చేస్తోంది. తన నాభి అందాలతో నెటిజన్ల చూపు తనవైపు తిప్పుకుంటోంది.

మ్యాగ్ జైన్ కవర్ పేజీని Elle ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. క్రూలో కృతితో స్క్రీన్ షేర్ చేసుకున్న కరీనా కపూర్ వ్యాఖ్యలను సుదీర్ఘమైన పోస్ట్ రూపంలో పెట్టింది. కృతి స్టన్నింగ్ లుక్ కు ఫిదా అయ్యామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జీన్స్ లో కృతి కటౌట్ అదిరిపోయిందని చెబుతున్నారు. పోజ్ సింప్లీ సూపర్బ్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. Elle ఇన్ స్టా పోస్ట్ కు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం.. కృతి సనన్ బాలీవుడ్ లో దో పత్తి మూవీ చేస్తోంది. నటిస్తూనే ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. సీనియర్ బ్యూటీ కాజోల్ ఈ మూవీలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని ఇటీవల కృతి తెలిపింది. ఎడిటింగ్ వర్క్ పూర్తి చేస్తున్నామని అప్డేట్ ఇచ్చింది. త్వరలోనే థియేటర్లలోకి రానున్న ఈ సినిమాతో కృతి ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి మరి.

Tags:    

Similar News