సమంత వల్లే తనకు స్ట్రగుల్స్ అంటుున్న విజయ్..!

Update: 2023-08-27 11:09 GMT

సమంత, విజయ్ దేవరకొండ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఖుషీ. ఈ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. ఈ మూవీకి సమంత, విజయ్ ల కెమిస్ట్రీలనే ప్రధాన ఆకర్షణ. దానికి తోడు మూవీలో పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.

ఇప్పటి వరకు నాలుగు పాటలు విడుదల చేయగా, అన్ని పాటలు ఒకదానితో మరొకటి పోటీ పడేలా ఉన్నాయి. నా రోజా నవ్వే, ఆరాధ్య, ఖుషీ ఈ పాటలన్నీ మ్యూజిక్ లవర్స్ ఫేవరేట్ సాంగ్స్ గా మారిపోయాయి. కాగా, తాజాగా ఈ మూవీ నుంచి ఐదో పాట విడుదల చేశారు.ఆ పాటలో విజయ్ ఫ్రస్టేషన్ మొత్తం తీర్చుకుంటున్నాడు.

పెళ్లిన తర్వాత భర్తలకు ఫ్రస్టేషన్ ఉండటం చాలా కామన్. కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త పాడుతున్న పాట ఇది. ఓసి పెళ్లామా అంటూ పాట సాగుతోంది. దాదాపు పెళ్లైన వారందరికీ ఈ పాట బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇక, ఈ పాటలో హీరోయిన్ ని హీరో కలుసుకున్న దగ్గర నుంచి మొదలైంది. మందు తాగుతూ విజయ్ యాక్టింగ్ అదరగొట్టాడు.

ఇక, ఈ ఖుషీ మూవీ సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ పూర్తయ్యాయి. స్పెషల్ గా మ్యూజిక్ కన్సర్ట్ కూడా చేశారు. స్టేజీ పై సమంత, విజయ్ డ్యాన్సులు కూడా అదరగొట్టారు. కొందరు ప్రీ వెడ్డింగ్ షూట్ లా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సమంత, అమెరికాలో కూడా ప్రమోషన్స్ చేస్తుండటం విశేషం.

ఇక, ఈ ఖుషీ మూవీ విషయానికి వస్తే, ఇది కంప్లీట్ లవ్ స్టోరీ. రెండు విభిన్న మతాల వారు ప్రేమించుకొని, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వారి జీవితం ఎలా ఉంది? సంతోషంగా ఉన్నారా? లేక గొడవలతో విడిపోయారా అనేదే ఈ కథ. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మరి ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News