హీరోయిన్ గా బిగ్ బాస్ దివి.. లంబసింగి రిలీజ్ ఎప్పుడంటే?

తాజాగా మేకర్స్ మరో సాంగ్ ను విడుదల చేశారు. వయ్యారి గోదారి అంటూ సాగుతున్న కొత్త పాటను జవేద్ అలీ ఆలపించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. ఆర్ ఆర్ ధ్రువన్ బాణీలు కట్టారు.

Update: 2024-03-07 18:17 GMT

బిగ్ బాస్ బ్యూటీ దివి వడ్త్య.. తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. బిగ్ బాస్ హౌస్ కు వెళ్లేముందు మహేష్ బాబు మహర్షి తోపాటు సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ మూవీల్లో మెరిసింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, జగపతి బాబు రుద్రంగిలో యాక్ట్ చేసింది. క్యాబ్ స్టోరీస్, నయూమ్ డైరీస్ చిత్రాల్లనూ నటించింది.

 

సినిమాలతో పాటు మా నీళ్ల ట్యాంక్, ఏటీఎం వెబ్ సిరీస్ ల్లో కూడా నటించి ఆకట్టుకుంది. త్వరలోనే రిలీజ్ కానున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 మూవీలో జర్నలిస్ట్ గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ లో మెరిసింది. అయితే ఈ బ్యూటీ తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కానుంది. ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సమర్పిస్తున్న లంబసింగి చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తోంది.

 

సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు, రారండోయ్ వేడుక చూద్దాం వంటి మంచి హిట్‌లను అందించిన కళ్యాణ్ కృష్ణ.. ఈ మూవీతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా భరత్ రాజ్ హీరోగా పరిచయం కానున్నారు. కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన నచ్చేసిందే.. నచ్చేసిందే సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంది.

 

తాజాగా మేకర్స్ మరో సాంగ్ ను విడుదల చేశారు. వయ్యారి గోదారి అంటూ సాగుతున్న కొత్త పాటను జవేద్ అలీ ఆలపించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. ఆర్ ఆర్ ధ్రువన్ బాణీలు కట్టారు. డిఫరెంట్ మెలోడీగా సాగే ఈ సాంగ్ కు మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. షూటింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. విడుదల తేదీని ప్రకటించారు.

 

మార్చి 15వ తేదీన లంబసింగి చిత్రం టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా తమ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మూవీ అవుట్ పుట్ బాగా వచ్చిందని అంటున్నారు. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, మాధవి, నవీన్ రాజ్ ఇతర పాత్రలు పోషించారు. మరి దివి హీరోయిన్ గా నటిస్తున్న ఫస్ట్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

 

Tags:    

Similar News