స్టార్ హీరోని 5కోట్లు ఇవ్వాలని బెదిరించి దొరికిపోయాడిలా
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొంత కాలంగా టెన్షన్ వాతావరణంలో గడుపుతున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొంత కాలంగా టెన్షన్ వాతావరణంలో గడుపుతున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అతడిని చంపేస్తామని పలుమార్లు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. అంతకంటే ముందే సల్మాన్ కి అత్యంత సన్నిహితుల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నారు. ఇటీవలే సల్మాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖ్‌ని తుపాకీతో కాల్చి చంపారు.
అదే సమయంలో సల్మాన్ నుండి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపు మెసేజ్ వచ్చింది. అయితే ఈ మెసేజ్ ఏ ఫోన్ నంబర్ నుంచి వచ్చిందో అదే మొబైల్ ఫోన్ నంబర్ నుండి ముంబై ట్రాఫిక్ పోలీసులకు క్షమాపణలు చెబుతూ సందేశం వచ్చినట్లు అధికారులు తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.
సోమవారం ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్‌లో క్షమాపణ సందేశం వచ్చిందని ఒక అధికారి చెప్పారు.
విచారణలో బెదిరింపు సందేశం పంపడానికి ఉపయోగించిన అదే మొబైల్ నంబర్ నుండి ఇప్పుడు క్షమాపణలు పంపినట్లు అతడు చెప్పాడు. బెదిరింపులను తేలికగా తీసుకోవద్దని పంపిన వ్యక్తి ఇంతలోనే క్షమాపణలు చెప్పాడు. బెదిరింపు, దోపిడీకి సంబంధించి భారతీయ న్యాయ సంహిత (BNS) కింద వర్లీ పోలీస్ స్టేషన్‌లో అతడిపై కేసు నమోదు అయింది.
ఇంతకుముందు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సూపర్‌స్టార్ సల్మాన్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్ బాంద్రా ఇంటిపైనా బిష్ణోయ్ ముఠా సభ్యులు కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ కేసులో మొత్తం 18 మందిని అరెస్ట్ చేసారు. కొన్ని నెలల క్రితం సల్మాన్ ఖాన్‌ను చంపడానికి బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన పన్నాగాన్ని ముంబై పోలీసులు బయటపెట్టారు.