'లియో'.. లోకేశ్ మారకపోతే ఇక అంతే
ప్రస్తుతం ఇండియన్ సినిమా డైరెక్టర్లరో క్రేజ్ ఉన్న దర్శకుల్లో లోకేశ్ ఒకరు. తీసింది తక్కువ సినిమాలే అయినా, మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.
ఇండస్ట్రీలో ఏ ట్రెండ్ అయినా కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త పోకడలు వస్తుంటాయి. ఎందుకంటే ఒకటే ఎప్పుడూ రిపీట్ అవుతుంటే ప్రేక్షకుడికి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అందుకే హీరోలు, దర్శకనిర్మాతలు.. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూంటారు. అవి క్లిక్ అయితే వాటిని కొంత కాలంపాటు కొనసాగిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలివేషన్ల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసింది.
ఓ హీరోకు లేదంటే సన్నివేశాలకు ఎలివేషన్ ఇవ్వడంతో ప్రశాంత్ నీల్, లోకేశ్ కనగరాజ్ వంటి దర్శకులు కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ విషయాన్ని పక్కనపెడితే.. 'ఖైదీ'తో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు చూసేలా చేసి, 'విక్రమ్'తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ గురించి మాట్లాడదాం.
ప్రస్తుతం ఇండియన్ సినిమా డైరెక్టర్లరో క్రేజ్ ఉన్న దర్శకుల్లో లోకేశ్ ఒకరు. తీసింది తక్కువ సినిమాలే అయినా, మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం విజయ్ హీరోగా 'లియో' తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో ఆయన ఒకే ట్రెండ్‌ను కొనసాగుతున్నట్లు అర్థమవుతోంది.
ఈ సినిమాకు సంబంధించి క్యారెక్టర్ ఇంట్రోలకు సంబంధించి ఆయన రిలీజ్ చేస్తున్న టీజర్లు అన్నీ ఒకేలా అనిపిస్తున్నాయి. ఇవి చూసిన అభిమానులు లోకేశ్ ఇంకా విక్రమ్ హ్యాంగోవర్ నుంచి బయట పడట్టు లేరని అంటున్నారు.
ఎందుకంటే తాజాగా రిలీజ్ చేసిన యాక్షన్ కింగ్ అర్జున్ను సంబంధించిన హరోల్డ్ దాస్ వీడియో విక్రమ్ సినిమాను గుర్తుచేస్తోంది. విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్ర కూడా ఇలానే ఉంటుంది. సేమ్ సూర్య స్టైల్లో ఓ ఖరీదైన వింటేజ్ కారులో వందలాది అనుచరుల కలిసి రావడం, దిగగానే ఒక వ్యక్తి చేతిని నరుకడం, అతడేమో గట్టిగా కేకలు పెడుతుండటం, కూర్రంగా అర్జున్ డైలాగ్ చెప్పడం అంతా సేమ్ రోలెక్స్ ఫార్మాట్లో కొనసాగింది.
ఇక ఇది చూసిన ఫ్యాన్స్ అద్భతంగా ఉందని కామెంట్లు పెడుతూనే.. మరోపక్క రోలెక్స్ పాత్రను గుర్తుచేస్తుందని అంటున్నారు. కాబట్టి స్టైల్ మార్చాలని సూచిస్తున్నారు. చూడాలి మరి లియో రిలీజ్ అయ్యాక సినిమా, అందులోని పాత్రలు ఎలా ఉంటాయో..