తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన లియో సినిమా ఆశించిన స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. తమిళ్ లో మంచి వసూళ్లు సాధించినా కూడా తెలుగు మరియు ఇతర తమిళేతర భాషల్లో మినిమం వసూళ్లు కూడా దక్కించుకోలేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చిన లియో ఇంకా తమిళనాట థియేటర్లలో సందడి చేస్తోంది. త్వరలోనే ప్రముఖ ఓటీటీ లో ఈ సినిమా ను స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ కోసం రెడీ చేసిన ఫైనల్ ఎడిటెడ్ వర్షన్ ను ఓటీటీకి ఇస్తారు. దాన్నే ఓటీటీ లు స్ట్రీమింగ్ చేయడం జరుగుతుంది. కానీ లియో విషయంలో అలా కాకుండా భిన్నంగా జరుగబోతుంది.
లియో సినిమా ఓటీటీ వర్షన్ కోసం ప్రత్యేకంగా రీ ఎడిటింగ్ జరుగుతుందట. హీరో విజయ్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను మరింత ఎలివేషన్ ఇస్తూ ఉండేలా రీ ఎడిట్ చేస్తున్నారట. అంతే కాకుండా సంజయ్ దత్ పాత్ర ను మరింతగా పెంచుతున్నారు. ఇక సినిమాలో వచ్చే కీలకమైన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల యొక్క నిడివిని పెంచుతున్నట్లు కూడా సమాచారం అందుతోంది.
మొత్తానికి లియో సినిమా ను థియేటర్ లో చూసింది కాకుండా ఓటీటీ లో కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రకటించడంతో అభిమానులు చాలా ఆసక్తిగా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వచ్చే వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లియో సినిమా లో విజయ్ కి జోడీగా త్రిష హీరోయిన్ గా నటించింది. ఇక విజయ్ ని రెండు విభిన్నమైన లుక్ లో ఫ్యాన్స్ చూసిన విషయం తెల్సిందే. ఓటీటీ వర్షన్ లో దాదాపుగా 30 నుంచి 35 నిమిషాల వరకు అదనపు సన్నివేశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సెన్సార్ లో పోయిన షాట్స్, కట్స్ కూడా ఓటీటీ వర్షన్ లో ఉంటాయని తెలుస్తోంది.