లియో తెలుగు.. పెట్టింది ఎంత? వచ్చింది ఎంత?
అయితే మూవీకి మొదటి వారంలో వచ్చిన కలెక్షన్స్ లెక్కలు చూసుకుంటే ఎక్కడా డ్రాప్ అయినట్లు లేదు మూవీ బ్రేక్ ఎవెన్ అందుకోవడమే కాకుండా సాలిడ్ హిట్ గా నిలిచినట్లు కనిపిస్తోంది.
ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం లియో. విజయ్ కి జోడీగా ఈ చిత్రంలో త్రిష నటించింది. మాఫియా నేపథ్యంలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఈ సినిమాకి మొదటి రోజు వంద కోట్లకి పైగా కలెక్షన్స్ వచ్చాయి.
సినిమాపై ఉన్న హైఎక్స్ పెక్టేషన్స్ కారణంగా సాలిడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. దీంతో మొదటి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని లియో మూవీ కొల్లగొట్టింది. అయితే సినిమాకి ఎవరేజ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి కలెక్షన్స్ పడిపోతూ వచ్చాయి. ఒక్క తమిళనాడులో తప్ప మిగిలిన అన్ని చోట్ల కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయనే మాట వినిపించింది.
అయితే మూవీకి మొదటి వారంలో వచ్చిన కలెక్షన్స్ లెక్కలు చూసుకుంటే ఎక్కడా డ్రాప్ అయినట్లు లేదు మూవీ బ్రేక్ ఎవెన్ అందుకోవడమే కాకుండా సాలిడ్ హిట్ గా నిలిచినట్లు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో లియో మూవీ హక్కులని 16 కోట్లకి సితారా ఎంటర్టైన్మెంట్ కొనుగోలు చేసింది. అయితే మూవీకి మొదటి వారం ఏకంగా 40.20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంట.
అందులో 22.28 కోట్ల షేర్ ఉంది. దీనిని బట్టి చూస్తే బ్రేక్ ఎవెన్ కంటే 5.28 షేర్ ఎక్కువగా వచ్చింది. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాలలో లియో సూపర్ హిట్ గా నిలిచినట్లే. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మొదటి వారంలో ఏకంగా 467.50 గ్రాస్ మూవీ కలెక్ట్ చేసిందని నిర్మాత అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. దీనిని బట్టి 234.70 షేర్ వచ్చింది.
సినిమా ప్రపంచ వ్యాప్తంగా 215 కోట్ల బిజినెస్ చేసింది. 216 కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకి రాగా అంతకంటే ఎక్కువే కలెక్ట్ చేసింది. 18.70 కోట్ల షేర్ అదనంగా ఈ సినిమాపై వచ్చింది. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే లియో మొదటి వారంలోనే బ్రేక్ ఎవెన్ సాధించి సూపర్ హిట్ మూవీగా నిలిచిందని చెప్పొచ్చు.