నిర్మాత - నటి మధ్య ముదిరిన వివాదం.. బ్లాక్ మెయిల్ కేసు నమోదు
సినిమా ఇండస్ట్రీలో లవ్ అఫైర్స్ సహజీవనం చేయడం ఈ మధ్య కాలం లో చాలా కామన్ అయింది
సినిమా ఇండస్ట్రీలో లవ్ అఫైర్స్.. సహజీవనం చేయడం ఈ మధ్య కాలం లో చాలా కామన్ అయింది. కొన్నాళ్లు సహజీవనం చేయడం లేదంటే పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకు బ్రేకప్ అవ్వడం ఈ మధ్య కాలంలో తరచు చూస్తూనే ఉన్నాం. కొందరు విడి పోయిన తర్వాత ఎవరి దారిలో వారు సైలెంట్ గా వెళ్తారు.. కొందరు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం.
తాజాగా ఒక ఒడియా నటి పోలీసులను ఆశ్రయించింది. ఆమె పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం... ఆమె గత కొన్నాళ్లగా నిర్మాతతో సహజీవనంలో ఉంది. అతడితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు వీడియోలు తీసుకోవడం జరిగిందట. ఆ ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవ్వడంతో ఆమె షాక్ అయ్యింది.
సదరు నిర్మాత తో కలిసి చాలా కాలంగా సహజీవనంలో ఉంటున్న నటి అతడి బ్యానర్ లో సినిమాలు చేసింది. వాటికి సంబంధించిన పారితోషికం ఇవ్వలేదట. అంతే కాకుండా బయటి సినిమాలు చేసేందుకు సిద్ధం అయితే తనపై భౌతిక దాడులు చేయడంతో పాటు మానసికంగా హింసించే విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
సదరు నటిని ప్రైవేట్ ఫోటోలతో నిర్మాత బెరిదిరిస్తున్నాడట. నిర్మాతతో సహజీవనం చేసిన విషయాన్ని పోలీసులకు నటి చెప్పింది. ఆ సమయంలో ఫోటోలు వీడియోలు తీశాడని కూడా ఆమె పేర్కొంది. ఇద్దరి మధ్య విభేదాలకు కారణం ఏంటి అనేది మాత్రం తెలియరాలేదు.
ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య చిన్న చిన్న విభేదాలు మొదలయ్యాయి. నటి మరో నిర్మాత తో సన్నిహితంగా ఉండటం.. ఆయన బ్యానర్ లో సినిమాకు కమిట్ అవ్వడంతో ఆమె ప్రియుడికి నచ్చక పోవడంతో బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు అనేది టాక్. అసలు విషయం ఏంటో అనేది పోలీసులు కనిపెట్టేనా చూడాలి.