భార్యాభర్తలిద్దరు పెద్ద ప్లానే వేసారు!
బాలీవుడ్ లో భార్యాభర్తలు రణబీర్ కపూర్-అలియాభట్ స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
బాలీవుడ్ లో భార్యాభర్తలు రణబీర్ కపూర్-అలియాభట్ స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు వందల కోట్ల రూపాయల వసూళ్లు తేగల సత్తా ఉన్న నటులు. యానిమల్ విజయంతో రణబీర్ రేంజ్ అంతకంతకు రెట్టింపు అయింది. ప్రస్తుతం అతడు నటిస్తోన్న `రామాయణ్` పై కూడా పాన్ ఇండియాలో భారీ అంచనాలున్నాయి. రామాయణం అందరికీ కనెక్ట్ అయ్యే కథ కావడంతో యూనివర్శల్గా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.
అటు అలియాభట్ `గంగూబాయి కతియావాడి` లాంటి హిట్ తో సోలో మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. పెళ్లైన తర్వాత రిలీజ్ అయిన `బ్రహ్మాస్త్ర` ప్లాప్ అయినా భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా వాళ్లి పేరిట ఓ రికార్డే నమోదైంది. ప్రస్తుతం `లవ్ అండ్ వార్` లో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా కి భార్యభర్తలిద్దరు వారి స్టార్ డమ్ ఆధారంగా బేస్ చేసుకుని ఎవరి పారితోషికం వారు తీసుకోవడం లేదు.
ఇద్దరు కలిపి సినిమాలో వాటా తీసుకునేలా ఒప్పందం దర్శక, నిర్మాత కరణ్ జోహార్ తో ఒప్పందం చేసు కున్నారు. ఇలా ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రణబీర్ పెద్ద ప్లానే వేసినట్లు కనిపిస్తుంది. ఇకపై ఇద్దరూ జంటగా ఏ సినిమా చేసినా? పారితోషికం కాకుండా రిలీజ్ అనంతరం వచ్చిన వసూళ్లలో షేర్ తీసుకునేలా ఆయా నిర్మాణ సంస్థలతో ముందుగానే ఒప్పందం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.
వాళ్లిద్దరు సినిమాలు ఈజీగా 500 కోట్ల వసూళ్లను రాబడతాయి. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే 1000 కోట్ల వసూళ్లు పెద్ద విషయం కాదు. ఆ లెక్కన పారితోషికం కంటే భారీ మొత్తంలో ఇద్దరి ఖాతాల్లో షేర్ జమ అవుతుంది. అయితే ఈ ఐడియా రణబీర్ జంటదా? సంజయ్ లీలా భన్సాలీ అన్నదా? తెలియాల్సి ఉంది. ఆయన ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలన్నింటిని సినిమా ప్రారంభం కావడానికి ముందే పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో అలియా-రణబీర్ భాగస్వామ్యం విషయం తెరపైకి వస్తోంది.