AR రెహమాన్‌ 30 చార్ట్‌బస్టర్‌లకు గాయ‌ని

అధుశ్రీ భారతదేశంలోని ప్రముఖ నేపథ్య గాయకులలో ఒకరు. ఈ ప్ర‌తిభావ‌ని ప్రధానంగా AR రెహమాన్ కంపోజిషన్లలో ప‌లు చార్ట్ బ‌స్ట‌ర్ల‌కు పనిచేసారు

Update: 2023-12-01 23:30 GMT

మధుశ్రీ భారతదేశంలోని ప్రముఖ నేపథ్య గాయకులలో ఒకరు. ఈ ప్ర‌తిభావ‌ని ప్రధానంగా AR రెహమాన్ కంపోజిషన్లలో ప‌లు చార్ట్ బ‌స్ట‌ర్ల‌కు పనిచేసారు. తమిళం, తెలుగు, హిందీ పాటల్లో ఆస్కార్-విజేత సంగీత స్వరకర్త రెహ‌మాన్ తో 30కి పైగా సూపర్‌హిట్ పాటలను అందించారు. కొన్ని సూపర్‌హిట్ పాటలలో 'యువ' (మ‌ణిర‌త్నం) చిత్రం నుండి 'కభీ నీమ్ నీమ్..' , 'బాహుబలి 2'లోని సోజా జరా ఉన్నాయి. మధుశ్రీ AR రెహమాన్ స్వరపరచిన పాటలను పాడారు. అనేక పాటలలో రెహమాన్ తో పాటు గాత్రదానం చేసారు.

గాయని అధుశ్రీ‌కి ఇప్పుడు 54 సంవత్సరాలు. హిందీలో విడుదలైన ఆమె చివరి హిందీ పాట 'వరిసు' చిత్రంలోనిది. ఇందులో ద‌ళ‌పతి విజయ్ ప్రధాన పాత్ర పోషించారు. అనేక హిట్‌లు, సూపర్‌హిట్‌లను అందించిన తర్వాత ఇప్పటికీ బాలీవుడ్‌లోని చాలా మంది సంగీత ప్రియులకు స‌ద‌రు గాయ‌ని ఎవ‌రో తెలియదు. AR రెహమాన్‌తో పాటు సంగీతాన్ని శాసించిన ఈ నేపథ్య గాయకురాలి ప్రయాణాన్ని ప‌రిశీలిస్తే ఎన్నో లోతైన విష‌యాల‌ను అర్థం చేసుకోవ‌చ్చు.

మధుశ్రీ కోల్‌కతాలో జన్మించింది. కల్ హో నా హో, కుచ్ నా కహో, తు బిన్ బటాయే, ఇన్ లమ్‌నో కే దామన్ మే వంటి అనేక సూపర్‌హిట్ పాటల్లో భాగమైంది. చాప్ తిలక్ సబ్ చీనీ అనే పాటను తన గాత్రంతో అజరామరంగా మార్చిన మొదటి వ్యక్తి ఆమె. ఈ పాట సూపర్‌హిట్‌గా మారింది. చాలా మంది గాయకులు తమ స్వరాలలో ఈ పాట‌ను వినిపించే ప్ర‌య‌త్నం చేసారు. రెండు దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో మధుశ్రీ తన సంగీత కళను డజన్ల కొద్దీ పాటలలో ప్రదర్శించింది. త‌న‌ కెరీర్‌లో మెజారిటీ సంవ‌త్స‌రాల‌లో చార్ట్‌బస్టర్‌లను అందించింది. మధుశ్రీ కెరీర్ ప‌రంగా పురోగతిని సాధించిన అనంత‌రం AR రెహమాన్ ఆవిష్కరణ(డిస్క‌వ‌రీ)గా ప్ర‌చార‌మైంది.

తన కెరీర్ ప్రారంభ సంవత్సరాల్లో మధుశ్రీ తన పాట‌ల‌ను CD లలో రికార్డ్ చేసి బాలీవుడ్‌లోని ప్రముఖ వ్యక్తులకు పంపేది. జావేద్ అక్తర్ ఆమె స్వరంలోని శ్రావ్యతను గమనించి,.. రాజేష్ రోషన్ 'మోక్ష' ద్వారా ప్లేబ్యాక్ గానం చేయడంలో త‌న‌కు సహాయం చేశాడు. తెహజీబ్ సినిమాలో పాటలకు టైటిల్ కార్డ్స్ లో మధుశ్రీకి బదులుగా సుజాతా భట్టాచార్య అని పేరు వేసారు. ఈ ఆల్బమ్‌ను AR రెహమాన్ స్వరపరిచారు. భ‌ట్టాచార్య‌గా ఆమె కీర్తిని పొందారు. కభీ నీమ్ నీమ్ పాటతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ పాట కోసం ఆమె ఉత్తమ మహిళా సెన్సేషన్‌గా ప్రతిష్టాత్మక సోనీ స్టార్‌డస్ట్ అవార్డును కూడా అందుకుంది. కానీ మధుశ్రీ ప్ర‌తిభ‌కు త‌గ్గ‌ట్టుగా ఇత‌ర గాయ‌నీమ‌ణుల‌తో ధీటుగా ప్ర‌చారం పొంద‌లేక‌పోయింది.

Tags:    

Similar News