ఆ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం నిజమే!
అందుకు రూప సమాధానమిస్తూ.. 'అవును నిజమే సంగీత దర్శకుడు కీరవాణి గారీ చిన్నబ్బాయి శ్రీసింహతో పెళ్లి నిశ్చయమైంది. ఏడాది చివర్లో పెట్టి ఉంటుంది' అని అన్నారు.
సీనియర్ నటుడు మురళీ మోహన్- సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబాల మధ్య పెళ్లి సంబంధం కుదురుతున్నట్లు కొంత కాలంగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. కీరవాణి తనయుడు-మురళీ మోహన్ మనవరాలి మధ్య ప్రేమ వివాహం జరుగుతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇందులో నిజం ఎంత? అన్నది క్లారిటీ లోపించింది. ఆ రెండు కుటుంబాల నుంచి కూడా ఎలాంటి వివరణ లేకపోవడంతో ఇది రూమర్ అని అంతా భావిస్తున్నారు.
రెండు కుటుంబాల నుంచి దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ ప్రచారాన్ని ఖండించింది కూడా లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రచారంపై మురళీ మోహన్ కోడలు..వధువు తల్లి అయిన మాగంటి రూప ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసారు. మామగారు మురళీ మోహన్ తో కలిసి రూప అలీతో జాలీగా టాక్ షోకి హాజరయ్యారు. ఈ షో వేదికగా అన్ని సందేహాలకు రూప పుల్ స్టాప్ పెట్టేసారు. 'మీ అమ్మాయికి- ఇండస్ట్రీకి చెందిన అబ్బాయితో పెళ్లి కుదిరిందని విన్నాను నిజమేనా? అని అడిగాడు అలీ.
అందుకు రూప సమాధానమిస్తూ.. 'అవును నిజమే సంగీత దర్శకుడు కీరవాణి గారీ చిన్నబ్బాయి శ్రీసింహతో పెళ్లి నిశ్చయమైంది. ఏడాది చివర్లో పెళ్లి ఉంటుంది' అని అన్నారు. దీంతో మురళీ మోహన్-కీరవాణి కుటుంబాలు బంధుత్వం కలుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక కీరణవాణి పెద్ద కుమారుడు కాలభైరవకి ఇంకా పెళ్లి కాలేదు. కానీ ఈ లోపే చిన్నబ్బాయి రెడీ అయ్యాడు. దీంతో ఇది ప్రేమ వివాహమా? అన్న సందేహం తెరపైకి వస్తుంది.
ఇక శ్రీసింహ విషయానికి వస్తే టాలీవుడ్ లో హీరోగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. 'మత్తువదలరా' అనే సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 'యమ దొంగ'తో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 'తెల్లవారితో గురువారం'..'దొంగలున్నారు జాగ్రత్త'.. 'ఉస్తాద్' సినిమాల్లో నటించాడు. మురుళీ మోహన్ కుమారుడు పేరు రామ్మోహన్. ఆయన కుమార్తె పేరు రాగ. బిజినెస్ లో మాస్టర్స్ పూర్తిచేసింది. ప్రస్తుతం సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఆమెనే శ్రీసింహ వివాహమాడుతున్నట్లు తెలుస్తోంది.