నాగార్జున‌-వెంక‌టేష్ మ‌ధ్య‌లో మ‌హేష్ తొలిసారి!

ఎవ‌రు బాక్సాఫీస్ వ‌ద్ద నెంబ‌ర్ వ‌న్ గా నిలుస్తారు? అన్న‌ది హాట్ టాపిక్ గా మారుతోంది.

Update: 2024-01-10 09:25 GMT

'గుంటూరు కారం`..'నా సామిరంగ‌`..'సైంధ‌వ్ `చిత్రాలు సంక్రాంతి కానుక‌గా ఒక రోజు గ్యాప్ లోనే రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. మూడు సినిమాల‌పైనా భారీ అంచ‌నాలున్నాయి. ముగ్గురు హీరోలు కావ‌డం స‌హా ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో అంచ‌నాలు స్కైని ట‌చ్ చేస్తున్నాయి. ముగ్గురు హీరోల‌కు భారీ ఎత్తున అభిమానులున్నారు. దీంతో అభిమానుల్లోనూ ఉత్కంఠ పెరిగిపోతుంది.

ఎవ‌రు బాక్సాఫీస్ వ‌ద్ద నెంబ‌ర్ వ‌న్ గా నిలుస్తారు? అన్న‌ది హాట్ టాపిక్ గా మారుతోంది. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ఇలా ముగ్గురు న‌టించిన చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వ‌డం అన్న‌ది ఎప్పుడైనా జ‌రిగిందా? ఇదే తొలిసారా? అంటే ఇదే మొట్ట మొద‌టిసారి అని ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తుంది. ఈ ముగ్గురి మ‌ధ్య ఇంత‌వ‌ర‌కూ ఎప్పుడు ఇలాంటి పోటీ నెల‌కొన‌లేద‌ని అంటున్నారు. వెంక‌టేష్..నాగార్జున చాలాసార్లు పోటీపోటీగా వాళ్ల సినిమాలు రిలీజ్ చేసారు.

కానీ వాళ్లిద్ద‌రి మ‌ధ్య‌లోకి మ‌హేష్ రావ‌డం అన్న‌ది ఇదే తొలిసారిగా క‌నిపిస్తుంది. గ‌తంలో మ‌హేష్‌.. వెంక‌టేష్ న‌టించిన మ‌ల్టీస్టారర్ `సీత‌మ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు` సంక్రాంతికి రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అది ఇద్ద‌రు క‌లిసి న‌టించిన సినిమా కాబ‌ట్టి క్రెడిట్ ఇద్ద‌రికీ ద‌క్కుతుంది. కానీ ఇప్పుడు సీనియ‌ర్ హీరోల‌తో ఆ త‌ర్వాత త‌రం న‌టుడైన మహేష్ పోటీ ప‌డ‌టం విశేషం.

ఆ ర‌కంగా ముగ్గురు మధ్య తొలిసారి పోటీ వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే ఇది ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన స‌న్నివేశంలోనే ఉంది. థియేట‌ర్ల స‌ర్దుబాటు అన్న‌ది ఓ ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతుంది. ఏ హీరో ఇబ్బంది ప‌డ‌కుండా..ఏ హీరో అభిమానులు హ‌ర్ట్ అవ్వ‌కుండా అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌ల‌తోనే సినిమాల్ని రిలీజ్ చేస్తు న్నారు. ఆ ర‌కంగా ఎలాంటి టెన్ష‌న్ వాతావ‌ర‌ణం లేదు. సంక్రాంతికి అన్ని సినిమాలు మంచి విజ‌యం సాధించాల‌ని ఇప్ప‌టికే ముగ్గురు హీరోలు కోరుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News