న‌మ్ర‌త‌కి మ‌హేష్ ఇచ్చిన బంగారు కానుక‌!

మ‌హేష్ నాకు ఇచ్చిన మొద‌టి బ‌హుమ‌తి వెడ్డింగ్ రింగ్. నేను ఇప్ప‌టివ‌ర‌కూ అందుకున్న బ‌హుమ‌తుల్లో క‌ల్లా రెండు ముఖ్య మైన‌వి.

Update: 2023-08-17 16:31 GMT

సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో వివాహం త‌ర్వాత న‌మ్ర‌త శిరోద్క‌ర్ సినిమాల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పూర్తిగా కుటుంబ జీవితానికే అంకిత‌మ‌య్యారు. సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చినా న‌టించ‌లేదు. కాల క్ర‌మంలో మ‌హేష్ బిజినెస్ వ్య‌వ‌హారాలు చూసుకోవ‌డం మొద‌లు పెట్టారు. జీఎంబీ ప్రొడ‌క్ష‌న్స్.. నిర్మాణానికి సంబంధించిన ఇత‌ర వ్య‌వ‌హ‌రాల్లో బిజీ అయ్యారు. ఇటీవ‌లే కుమార్తె సితార ఓ జ్యూయ‌ల‌రీ యాడ్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా తాజాగా బంగారం పై త‌న ఇష్టా అయిష్టాల‌ను రివీల్ చేసారు.

'నాకు న‌గ‌లంటే ఇష్టముండ‌దు. చాలా సింపుల్ గా ఉంటాను. షాపింగ్ లు కూడా పెద్ద‌గా చేయ‌ను. మ‌హేష్ నాకు ఇచ్చిన మొద‌టి బ‌హుమ‌తి వెడ్డింగ్ రింగ్. నేను ఇప్ప‌టివ‌ర‌కూ అందుకున్న బ‌హుమ‌తుల్లో క‌ల్లా రెండు ముఖ్య మైన‌వి. ఒక‌టి మ‌హేష్ ఇచ్చిన రింగ్..రెండ‌వ‌ది అమ్మ 8 ఏళ్ల వ‌య‌సులో సాయిబాబా ఉంగ‌రం ఇచ్చింది. ఇప్ప‌టికీ ధ‌రిస్తున్నాను. అవి రెండు నాకు చాలా స్పెష‌ల్' అని తెలిపారు.

అలాగే సితార యాడ్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం రివీల్ చేసారు. 'సితార జ్యూయ‌ల‌రీ యాడ్ కి సంబంధించిన కొన్ని చిత్రాల్ని న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డ్ పై ప్ర‌ద‌ర్శించారు. అది చూసి మ‌హేష్ తో ఎంతో సంతోషించారు. కుమార్తెని అలా చూసుకుని మ‌హేష్ చాలా ఆనంద‌ప‌డ్డారు. ఆయ‌న ఆనందం చూసి నాకు ఎంతో ముచ్చ‌టేసింది. అలాగే మ‌హ‌ష్ తో క‌లిసి సినిమా చేస్తున్నాను అనే ప్ర‌చారం సాగుతోంది. అందులో ఎలాంటి నిజం లేదు. సినిమాలు చేసే ఉద్దేశం లేదు' అని తెలిపారు.

ఇక మ‌హేష్ కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్య‌త గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. షూటింగ్ లేక‌పోతే ఇంట్లోనే ఉంటారు. వెకేష‌న్ కోసం కుటుంబంతో వారం ప‌ది రోజులు విదేశాలు వెళ్తారు. ఏడాదికి క‌నీసం మూడు నాలుగు వెకేష‌న్లు అయినా ఉంటాయి.

Tags:    

Similar News