'రాజాసాబ్' తర్వాత సూపర్‌స్టార్‌తో మాళవిక..!
ఒకవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న మాళవిక మరోవైపు మలయాళ సూపర్ స్టార్, సీనియర్ హీరో మోహన్‌లాల్ సినిమాలో నటించేందుకు కమిట్ అయ్యింది.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజాసాబ్' సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ముగ్గురు హీరోయిన్స్‌లో ఒక హీరోయిన్‌గా మాళవిక మోహనన్ నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో మొదటి సారి నటిస్తున్న మాళవిక మోహనన్ మరో వైపు తమిళ్, మలయాళ సినిమాల్లోనూ వరుసగా నటిస్తోంది. ఇప్పటికే కోలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు రాజాసాబ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న మాళవిక మరోవైపు మలయాళ సూపర్ స్టార్, సీనియర్ హీరో మోహన్‌లాల్ సినిమాలో నటించేందుకు కమిట్ అయ్యింది. మోహన్‌లాల్ హీరోగా సత్యన్ అంతికాడ్ దర్శకత్వంలో రూపొందబోతున్న 'హృదయపూర్వం' సినిమాలో మొదట ఐశ్వర్య లక్ష్మిని హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో మాళవిక మోహన్‌ను ఎంపిక చేసినట్లుగా దర్శకుడు సత్యన్ ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పుకొచ్చారు. అంతే కాకుండా సినిమాను ఫిబ్రవరి 10న ప్రారంభించబోతున్నామని, ఫిబ్రవరి 14 నుంచి మోహన్ లాల్ షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు ఆయన తెలియజేశారు.
మోహన్‌లాల్, మాళవిక కాంబోలో రూపొందబోతున్న 'హృదయపూర్వం' అనే ఈ సినిమా పూణేలో జరిగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతుంది. ఈ సినిమాలో చింతా విష్టయ్య, సంగీత్ ప్రతాప్, సిద్దిక్, జనార్థనన్‌లు నటించబోతున్నారు. పూణెలో సినిమా యొక్క కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు. మోహన్‌లాల్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. అయితే ఆయన అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు. సత్యన్ 'హృదయపూర్వం' సినిమాను విభిన్నంగా రూపొందిస్తాడనే నమ్మకం అందరిలోనూ ఉంది. అందుకే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
'రాజాసాబ్' సినిమాకి సంబంధించి మాళవిక మోహనన్ పాత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. ప్రభాస్‌తో కలిసి ఒక పాటలో ఈమె నటించాల్సి ఉంది. ఆ తర్వాత సినిమా విడుదల సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది. రాజాసాబ్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిన కారణంగానే మోహన్‌లాల్ సినిమాలో మాళవిక మోహనన్ జాయిన్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. రాజాసాబ్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే ఇక మీదట ఈ అమ్మడికి మరిన్ని పాన్ ఇండియా సినిమాల్లో ఛాన్స్ రావడం ఖాయం. అయితే సీనియర్ హీరో మోహన్‌లాల్‌తో నటించడం వల్ల యంగ్ హీరోలు ఈమెతో నటించేందుకు ఆసక్తి చూపించరేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.