ఆరోపణలు ఎదుర్కున్న వారంతా గెటౌట్!
ఇప్పటికే ఇండస్ట్రీలో వివిధ పదవుల్లో ఉన్న వారంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజీనామా చేసారు. అమ్మ కళాకారుల సంఘం కూడా రద్దమైంది.
హేమ కమిటీ నివేదిక మాలీవుడ్ ని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాధిత మహిళలంతా ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయంపై గొంతెత్తడంతో సన్నివేశం మరింత జఠిలంగా మారింది. ఇప్పటికే ఇండస్ట్రీలో వివిధ పదవుల్లో ఉన్న వారంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజీనామా చేసారు. అమ్మ కళాకారుల సంఘం కూడా రద్దమైంది.
కొత్త పాలక వర్గం ఎన్నుకోవాలంటూ ఆరోపణల నేపథ్యంలో కొంత మంది దిగిపోగా, మరికొంత మంది ఇలాంటి సమయంలో పదవులు భావ్యం కాదని బయటకు వచ్చేసారు. అయితే తాజాగా హేమ నివేదిక ప్రభావంతో బ్రాండ్ కంపెనీలు సైతం ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాయట. అలాంటి వారు తమ బ్రాండ్ ని ఎండార్స్ చేస్తే కంపెనీకి నష్టాలు తప్పవని భావించి ఒప్పందం రద్దు చేసుకుంటున్నాట.
అలాగే చిన్న నిర్మాణ సంస్థలు కూడా తమ సినిమాల్లో ఎంపికైన వారు ఎవరైనా లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటే అలాంటి వారిని సదరు నిర్మాణ సంస్థలు తొలగిస్తున్నాయట. అలాంటి వారు తమ సినిమాల్లో నటిస్తే చెబ్బ పేరు వస్తుందనే భయంతో ముందుగానే దిద్దుబాటు చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. అయితే అగ్ర నిర్మాణ సంస్థలు మాత్రం అలాంటి చర్యలకు పూనుకోలేదు.
అక్కడ ఎలాంటి సమస్య లేదని చెబుతున్నారు. ఈ రకమైన ఎలిమినేషన్ తో చిన్న నిర్మాణ సంస్థలే నటులు దొరక్క ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఉద్యమం ఇంకెలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో? చూడాలి. గతంలో బాలీవుడ్ లో తెరపైకి వచ్చిన మీటూ ఉద్యమం కూడా తీవ్ర స్థాయిలోనే జరిగిన సంగతి తెలిసిందే.