స్పిరిట్ మెగా రోల్.. సెట్టయ్యేనా?

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం, ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశముంది.

Update: 2024-10-07 04:06 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రానున్న హై వోల్టేజ్ యాక్షన్ సినిమాల్లో ‘స్పిరిట్’ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం, ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశముంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఒక మెగా యాక్టర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారని టాక్. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.

అయితే, తాజా బజ్ ప్రకారం, మమ్ముట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, సినిమా యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మమ్ముట్టి తెలుగులో ఇదివరకే యాత్ర సినిమాతో మంచి గుర్తింపు అందుకున్నారు. అఖిల్ ఏజెంట్ సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. కానీ అదేమీ అంత గుర్తింపుని తీసుకు రాలేదు. ఇక ప్రభాస్ స్పిరిట్ లో ఆయన నిజంగా ఉంటే మాత్రం కాంబినేషన్ కు మంచి క్రేజ్ దక్కే అవకాశం ఉంది.

మరోవైపు ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి కథాంశం గురించి కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, తన గత చిత్రాలు ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ వంటి సినిమాల్లో చూపించినట్లు, ‘స్పిరిట్’లో కూడా ఓ వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం. ప్రభాస్ కాస్త నెగిటివ్ షేడ్ లో కూడా కనిపిస్తాడట.

ప్రభాస్ ఫస్ట్ టైమ్ పోలీస్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ యాక్షన్ సన్నివేశాలతో, వైల్డ్ ఎలిమెంట్స్ తో ఉండబోతుందని టాక్. గతంలో సందీప్ తన సినిమాల్లో చూపించిన విభిన్నమైన మేకింగ్ స్టైల్, క్యారెక్టరైజేషన్ ‘స్పిరిట్’ లో మరింతగా ఉండబోతోందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయ్యింది, మరియు షూటింగ్ 2024లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ‘స్పిరిట్’ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతుంది. దాదాపు రూ.400 కోట్లకు పైగా ఈ చిత్రానికి ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాను టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News