మంచు లక్ష్మి.. టాప్ అందాలతో కిల్లర్ లుక్
బ్లాక్ బ్రా లో అమ్మడు గతంలో ఎప్పుడు లేనంత గ్లామర్ హీట్ పెంచేసింది. ముఖ్యంగా లుక్స్ తోనే స్టన్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది.
టాలీవుడ్‌లో నటిగా మంచు లక్ష్మి తనకంటూ ఒక ప్రత్యేకమైమ గుర్తింపును పొందారు. మంచు మోహన్ బాబు కుమార్తె అయిన మంచు లక్ష్మి, అనగనగా ఒక ధీరుడు సినిమాలో ఐరెంద్రీ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రతో తెలుగు తెరపైకి అడుగుపెట్టింది. ఈ పాత్రలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకున్నా, సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
తెలుగులో కంటే ముందే, మంచు లక్ష్మి పలు హాలీవుడ్ టెలివిజన్ సిరీస్‌లలో, హాలీవుడ్ సినిమాలలో కూడా తన ప్రతిభను చూపించింది. అక్కడే తన కెరీర్‌ను కొనసాగించాలని మొదట ప్రయత్నించింది. అయితే, తెలుగులో నిర్మాతగా మరియు ఫిమేల్ సెంట్రిక్ కథలతో హీరోయిన్‌గా ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. అలాగే, టెలివిజన్ షోలు హోస్ట్‌గా కూడా మంచు లక్ష్మి తన మార్కును చూపించింది.
ఆ మధ్య మోహన్ లాల్ హీరోగా నటించిన మాన్ స్టర్ సినిమాలో, ఆమె మలయాళంలో పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం, ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. మంచు లక్ష్మి తన ఫిట్‌నెస్‌కు కూడా ప్రాముఖ్యతనిచ్చి ఎప్పటికప్పుడు అభిమానులను ఆశ్చర్యపరుస్తూ వస్తోంది.
సోషల్ మీడియాలో కూడా మంచు లక్ష్మి చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన ఫోటో షూట్‌లతో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఇటీవల ఆమె మరోసారి స్టన్ అయ్యేలా గ్లామరస్ ఫొటోస్ ఆశ్చర్యం కలిగించింది. బ్లాక్ బ్రా లో అమ్మడు గతంలో ఎప్పుడు లేనంత గ్లామర్ హీట్ పెంచేసింది. ముఖ్యంగా లుక్స్ తోనే స్టన్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు, ఆమె ఫిట్‌నెస్, అందాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.
నాలుగు పదుల వయసులో కూడా ఆమె తన ఫిట్నెస్‌తో అందంతో ఆశ్చర్యపరుస్తోంది. ఇదివరకే ట్రెడిషనల్ లుక్‌లో కూడా తన ప్రత్యేకతను చూపిస్తూ, నెటిజన్ల మనసులను దోచుకుంది. ఇంత అందంగా ఉంటే హీరోయిన్స్ ఎవరూ పోటీ ఇవ్వలేరని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మి రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో మరింత మెరుస్తుందనే నమ్మకంతో ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. తన ప్రతిభతో, ఫిట్‌నెస్‌తో, మరియు అందంతో ఆమె టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందనే ఆశాభావంతో ఉన్నారు.