చిరు నో, బాలయ్య ఓకే.. ఆ హిట్‌ మూవీ ఏంటో తెలుసా..!

మన చుట్టు ఉన్న వారిలో ఒకరి అభిరుచితో మరొకరి అభిరుచి కలవదు. ఒకరికి ఒకటి ఇష్టం అయితే మరొకరికి మరోటి ఇష్టం ఉంటుంది.

Update: 2024-05-15 03:00 GMT

మన చుట్టు ఉన్న వారిలో ఒకరి అభిరుచితో మరొకరి అభిరుచి కలవదు. ఒకరికి ఒకటి ఇష్టం అయితే మరొకరికి మరోటి ఇష్టం ఉంటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరి కోరికలు వారివి, ఎవరి ఆసక్తులు వారివి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చాలా మంది హీరోలు తమ వద్దకు వచ్చిన కథల్లో ఎక్కువ శాతం తిరస్కరిస్తూ ఉంటారు. కొన్నింటిని చేసే సమయం లేకపోవడం వల్ల తిరస్కరిస్తే కొన్ని కథలను మాత్రం దర్శకుడు, ఇతర విషయాలు నచ్చక పోవడం వల్ల వదిలేస్తారు. ఎక్కువ శాతం ప్రాజెక్ట్‌ లను కథలు నచ్చక పోవడం వల్ల తిరస్కరిస్తూ ఉంటారు.

ప్రస్తుత యంగ్‌ హీరోలను మొదలుకుని అప్పట్లో ఏయన్నార్‌ మరియు ఎన్టీఆర్‌ ల వరకు కూడా ఎంతో మంది ఎన్నో ప్రాజెక్ట్‌ లను వదిలేసిన విషయం తెల్సిందే. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఒక కథకు నో చెప్పడం, ఆ కథకు బాలయ్య ఓకే చెప్పడం సూపర్‌ హిట్‌ దక్కించుకోవడం జరిగిందట.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అప్పట్లో కోడి రామకృష్ణ అంటే మంచి బ్రాండ్‌ ఇమేజ్ ఉండేది. అలాంటి కోడి రామకృష్ణ చెప్పిన కథకు చిరంజీవి నో చెప్పాడు. అలాంటి పల్లెటూరు బ్యాక్ డ్రాప్ సినిమాలకు నేను సెట్‌ అవ్వలేనేమో అంటూ ఆయన తప్పుకున్నాడట.

చిరంజీవి నో చెప్పిన అదే కథ ను దర్శకుడు కోడి రామకృష్ణ కొన్నాళ్ల తర్వాత బాలకృష్ణ వద్దకు వెళ్లాడు. బాలయ్య ఆ కథ కు ఓకే చెప్పాడు. అదే మంగమ్మగారి మనవడు. కథకు ఓకే చెప్పిన వెంటనే సినిమా ప్రారంభం అవ్వడం, విడుదల అవ్వడం, సూపర్‌ హిట్‌ అవ్వడం స్పీడ్‌ గా జరిగింది. మరి చిరంజీవి ఆ సినిమాను చేసి ఉంటే ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారు.

Tags:    

Similar News