'డాకు మహారాజ్' అప్డేట్.. నటసింహం మాస్ తుఫాన్!

"డాకు మహారాజ్ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ సంక్రాంతికి బిగ్ స్క్రీన్‌లలో మాస్ తుఫాను కోసం మేమంతా సిద్ధంగా ఉన్నాము.

Update: 2024-12-03 22:30 GMT

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ''డాకు మహారాజ్''. బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ భారీ మాస్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయినట్లుగా మేకర్స్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

"డాకు మహారాజ్ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ సంక్రాంతికి బిగ్ స్క్రీన్‌లలో మాస్ తుఫాను కోసం మేమంతా సిద్ధంగా ఉన్నాము. అల్టిమేట్ పవర్ ప్యాక్డ్ మాస్ విస్ఫోటనం కోసం సిద్ధంగా ఉండండి" అని మేకర్స్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా 'డాకూ ఇన్ యాక్షన్' అంటూ సరికొత్త పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో దర్శకుడు బాబీ సెట్స్ లో బాలయ్యకు సన్నివేశాన్ని వివరిస్తూ కనిపించారు. సెటప్ చూస్తుంటే ఇది సినిమాలో హాస్పిటల్ లో జరిగే సీన్ అని అర్థమవుతోంది.

'అఖండ', 'వీర సింహా రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న నటసింహం బాలకృష్ణ... 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన డైరెక్టర్ బాబీ కొల్లి కలిసి చేస్తున్న సినిమా కావడంతో "డాకు మహారాజ్" పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది కాబట్టి, లేట్ చేయకుండా బ్యాక్ టూ బ్యాక్ ఏదొక ప్రమోషనల్ కంటెంట్ వదలాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

'డాకు మహారాజ్' సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్ లో కనిపించారు. టీజర్ లో "ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మ రాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది" అంటూ బాలయ్య పాత్రను పరిచయం చేశారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్, చాందినీ చౌదరి, రిషి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.థమన్ సంగీతం సమకూర్చారు. 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా, నిరంజన్ దేవరమానే ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 'డాకు మహారాజ్' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

సంక్రాంతికి 'డాకు మహారాజ్' సినిమాతో పాటుగా 'గేమ్ చేంజర్' 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మిగతా రెండు సినిమాల ప్రమోషన్స్ స్పీడ్ అందుకుంటున్నాయి కానీ, ఆ విషయంలో బాలయ్య మూవీ కాస్త వెనకబడి పోయింది. వీలైనంత త్వరగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చి, మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి నిర్మాత నాగ వంశీ ఎలాంటి అప్డేట్ తో వస్తాడో చూడాలి.

Tags:    

Similar News