మాస్ రాజా బ్యాక్ టూ బ్యాక్ కిక్కులు
అయితే డిసెంబర్ ఆఖరు నుంచి మాస్ రాజా ఫ్యాన్స్ కి ట్రీట్ లాంటి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో విరల అవుతోంది.
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం టాలీవుడ్ లో గ్యాప్ లేకుండా ఏడాదికి రెండు, మూడు సినిమాలు రిలీజ్ చేస్తోన్న హీరోగా ఉన్నాడు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రవితేజ నుంచి మూడు సినిమాలు వచ్చాయి. వాటిలో వాల్తేర్ వీరయ్య సూపర్ హిట్ అయ్యింది. ఈ సక్సెస్ ని మెగాస్టార్ చిరంజీవితో కలిసి పంచుకున్నారు.
రావణాసుర డిజాస్టర్ అయ్యింది. రీసెంట్ గా వచ్చిన టైగర్ నాగేశ్వరరఉ మూవీ రిలీజ్ అయ్యి ఎవరేజ్ టాక్ సొంతం చేసుకుంది. మరల వచ్చే ఏడాది జనవరికి ఈగల్ మూవీ రిలీజ్ కి కాబోతోంది. దీనిపైన భారీ అంచనాలు క్రియేట్ అయి ఉన్నాయి. అయితే డిసెంబర్ ఆఖరు నుంచి మాస్ రాజా ఫ్యాన్స్ కి ట్రీట్ లాంటి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో విరల అవుతోంది.
డిసెంబర్ 30న రవితేజ సూపర్ హిట్ మూవీ వెంకీ రీరిలీజ్ అయ్యి థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమాకి ఫ్యాన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. తరువాత జనవరి 13న కార్తిక్ ఘట్టమనేనితో చేస్తోన్న ఈగల్ రిలీజ్ అవ్వబోతోంది. అదే నెలలో 26న రవితేజ ట్రేడ్ సెట్టర్ మూవీ కిక్ రీరిలీజ్ అయ్యి థియేటర్స్ లోకి రాబోతోంది. దీని తర్వాత సమ్మర్ కానుకగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ చేస్తోన్న 4వ మూవీ రానుంది.
ఇలా మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి డిసెంబర్ నుంచి వరుసగా ట్రీట్ లు లభిస్తున్నాయి. రెండు రీరిలీజ్ జాబితాలో ఉండగా మరో రెండు స్ట్రైట్ రిలీజ్ మూవీస్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు కచ్చితంగా సక్సెస్ అవుతాయని అంచనా వేస్తున్నారు. మాస్ రాజా ఇమేజ్ ని నిలబెట్టె మూవీస్ రెండు కూడా కావడం` గమనార్హం. మరి ఈ చిత్రాలలో పండగ కానుకగా వస్తోన్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తోంది. రవితేజ కెరియ లో హైయెస్ట్ బడ్జెట్ ఈ సినిమాకి పెడుతున్నారు.