మత్తు వదలరా 2… ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

శ్రీసింహ, సత్య, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ లో నటించిన మత్తు వదలరా 2 తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Update: 2024-09-14 06:52 GMT

శ్రీసింహ, సత్య, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ లో నటించిన మత్తు వదలరా 2 తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రితేష్ రానా డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రితేష్ రానా తెరకెక్కించారు. మత్తు వదలరాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాపై ట్రైలర్ తోనే ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. అలాగే హిట్ మూవీకి సీక్వెల్ రావడంతో కాస్తా హైప్ క్రియేట్ అయ్యింది.


మూవీ ప్రమోషన్స్ కూడా చాలా వినూత్నంగా చేశారు. దీంతో మొదటి రోజు ఈ సినిమాకి పబ్లిక్ నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా ఏకంగా 5.3 కోట్ల కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిందని మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీస్ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్న సినిమాలలో మొదటి రోజు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ ని ఈ సినిమా అందుకుంది. దీనిని బట్టి మత్తు వదలరా 2 కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూసారో చెప్పొచ్చు.

మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో శని, ఆదివారాలు కూడా కలెక్షన్స్ భారీగా వస్తాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మత్తు వదలరా2కి పోటీగా రిలీజ్ అయిన సినిమాలు ఏవీ కూడా ఈ సినిమా స్థాయిని అందుకోలేదు. దీంతో వీకెండ్ మత్తు వదలరా 2 ఫన్ రైడ్ గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో సత్య కామెడీ పెర్ఫార్మెన్స్ హీలేరియస్ గా ఉందనే అభిప్రాయం పబ్లిక్ నుంచి వస్తోంది. సినిమాలో ఆధ్యాంతం అతని పాత్ర నవ్విస్తూనే ఉందని టాక్ వినిపిస్తోంది.

మత్తు వదలరాతో హీరోగా పరిచయం అయిన శ్రీసింహ తరువాత నాలుగు సినిమాలు చేసిన కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. మరల మత్తువదలరా2 తో రెండు హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫరియా అబ్దుల్లా కూడా జాతిరత్నాలు సినిమా తర్వాత సరైన సక్సెస్ లు అందుకోలేదు. ఆమెకి కూడా మత్తు వదలరా 2 కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ పేరు మరోసారి ఈ సినిమా వినిపించేలా చేసింది.

మత్తు వదలరా సినిమా తర్వాత లావణ్య త్రిపాఠితో హ్యాపీ బర్త్ డే చేసి ఫ్లాప్ అందుకున్న రితీష్ రానా మరల మత్తువదలరా 2తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఇలా మత్తు వదలరా 2 టీమ్ మొత్తానికి కూడా ఈ సక్సెస్ మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక మిగతా రోజుల్లో ఈ సినిమా ఎలాంటి.కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News