మత్తు వదలరా 2 బిజినెస్ ఎంతంటే?

మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో శని, ఆది వారాలు మత్తు వదలరా 2 మూవీకి మంచి వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

Update: 2024-09-14 04:07 GMT

శ్రీసింహ, సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన తారాగణంగా రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన మత్తు వదలరా 2 మూవీకి ఓ వర్గం నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఫుల్ కామెడీతో ప్రేక్షకులని చివరి వరకు నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ సినిమా చేసినట్లు తెలుస్తోంది. మాత్ టాక్ కలిసొస్తే సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో శని, ఆది వారాలు మత్తు వదలరా 2 మూవీకి మంచి వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మత్తు వదలరా మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చింది. జాతిరత్నాలు తర్వాత మరోసారి ఫరియా అబ్దుల్లా తనదైన స్టైల్ లో కామెడీ చేసి ఎంటర్టైన్ చేసిందని తెలుస్తోంది. అలాగే మత్తు వదలరా తర్వాత శ్రీసింహ ఈ మూవీతో కెరియర్ లో సెకండ్ సక్సెస్ ని అందుకున్నాడని అంటున్నారు.

ఈ సినిమాకి 5 నుంచి 8 కోట్ల మధ్యలో బడ్జెట్ పెట్టారంట. హిట్ మూవీ సీక్వెల్ కావడంతో సినిమాకి ప్రీరిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందంట. కానీ వేరే డిస్టిబ్యూటర్స్ కి ఇవ్వకుండా మైత్రీ వారే సొంతంగా రిలీజ్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఓవరాల్ 4 కోట్ల వరకు ఈ మూవీ బిజినెస్ లెక్కలు తేలాయని తెలుస్తోంది. నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా సినిమా బడ్జెట్ మొత్తం రికవరీ అయిపోయిందని సమాచారం.

దీంతో టేబుల్ ప్రాఫిట్ తోనే ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఏరియా వారీగా బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి. నైజాంలో 1.50 కోట్లు, సీడెడ్ లో 50 లక్షలు, ఆంధ్రాలో 1.20 కోట్ల బిజినెస్ జరిగిందంట. రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి 80 లక్షల బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 4 కోట్ల మేరకు మత్తు వదలరా 2పైన వ్యాపారం జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఈ సినిమాకి చాలా తక్కువగానే ఉంది.

గట్టి పోటీ ఇచ్చే సినిమాలు ఏవీ లేకపోవడంతో కచ్చితంగా మత్తు వదలరా 2కి మంచి ప్రేక్షకాదరణ లభిస్తుందని మేకర్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. వీకెండ్ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ వచ్చేస్తాయని భావిస్తున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా లాంగ్ రన్ లో ఏ మేరకు కలెక్షన్స్ అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News