మీనాక్షికి మంచి రోజులొచ్చినట్టేనా..?

సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి.

Update: 2024-10-20 22:30 GMT

సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. ఆ తర్వాత వరుసగా యువ హీరోల సరసన ఛాన్స్ అందుకుంది. ఐతే మహేష్ బాబుతో గుంటూరు కారం, తమిళ హీరో దళపతి విజయ్ తో గోట్ సినిమాలో నటించిన మీనాక్షి ఆ సినిమాలతో పెద్దగా మెస్మరైజ్ చేసింది ఏమి లేదు. ఐతే అమ్మడు మాత్రం ఇప్పుడు వరుస సినిమాలతో రాబోతుంది. ముఖ్యంగా నెల రోజుల్లోనే 3 సినిమాలతో తన లక్ టెస్ట్ చేసుకుంటుంది మీనాక్షి చౌదరి.

మీనాక్షి చౌదరి ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమా చేస్తుంది. ఆ సినిమా నవంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. ఇదే కాకుండా విశ్వక్ సేన్ తో మెకానిక్ రాకీ, వరుణ్ తేజ్ మట్కా సినిమాల్లో నటిస్తుంది. ఐతే ఈ సినిమాలన్నిటిలో కూడా మీనాక్షి లీడ్ హీరోయిన్ గా నటించడం విశేషం. తప్పకుండా ఈ సినిమాల ఫలితాలు అమ్మడి కెరీర్ కి మంచి బూస్ట్ ఇస్తాయని చెప్పొచ్చు.

మంచి ఫాంలోకి రావాల్సిన టైం లో మీనాక్షి ఇలా సైడ్ రోల్స్ చేయడంతో ఆడియన్స్ షాక్ అయ్యారు. కానీ అమ్మడు త్వరగానే తిరిగి కరెక్ట్ రూట్ లోకి వెళ్తుంది. రాబోతున్న సినిమాల్లో ఏ ఒక్క రోల్ క్లిక్ అయినా సరే మీనాక్షికి మంచి రోజులు వచ్చినట్టే అని చెప్పొచ్చు. అటు మహేష్, విజయ్ లాంటి హీరోలతో చేసినా యువ హీరోలకు అమ్మడు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఎలాగు తన ఛార్మింగ్ తో ఎట్రాక్ట్ చేస్తున్న ఈ అమ్మడు కొద్దిగా ట్రై చేస్తే సౌత్ టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది.

మీనాక్షి కూడా తన ప్రతి సినిమాకు తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తుంది. రాబోయే సినిమాలకు అమ్మడికి కాస్త లక్ ఫేవర్ చేస్తే మాత్రం మీనాక్షి మేనియా కొనసాగించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి మీనాక్షి లక్ ఎలా ఉంది.. ఈ 3 సినిమాల తర్వాత అమ్మడి ఫేట్ మారుతుందా లేదా అన్నది చూడాలి. విశ్వక్, దుల్కర్, వరుణ్ తేజ్ ముగ్గురు యువ హీరోలతో మీనాక్షి మూవీస్ ఆమె కెరీర్ కు ఎంతమేరకు హెల్ప్ అవుతాయన్నది చూడాలి.

Tags:    

Similar News