కవర్‌పేజీపై మీనాక్షి మెరుపులే మెరుపులు
మీనాక్షి చౌదరి తాజాగా జే.ఎఫ్.డబ్ల్యూ కవర్ పేజీపై దర్శనమిచ్చింది. ఈ ఫోటోషూట్ పూర్తిగా ప్రయోగాత్మకంగా కనిపిస్తోంది.
వరుసగా బ్లాక్ బస్టర్లు కొడుతోంది మీనాక్షి చైదరి. తెలుగులో లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం ఈ భామకు నటిగా మంచి పేరు తెచ్చి పెట్టగా, `గోట్` చిత్రం తమిళంలో తనకు కమర్షియల్ విజయాన్ని కట్టబెట్టింది. ఆరంభం కొన్ని ఫ్లాపులు చికాకు పెట్టినా, ఇప్పటికి టైమ్ వచ్చింది. తనకు కొన్ని హిట్లు అందాయి. ఇది చాలు.. తాను ఏలడానికి అనే నమ్మకంతో మీనాక్షి ఇకపైనా దూసుకెళుతుంది. ఇప్పటికే టాలీవుడ్ కోలీవుడ్ లో వరుస చిత్రాలకు సంతకాలు చేస్తోంది.
మీనాక్షి చౌదరి తాజాగా జే.ఎఫ్.డబ్ల్యూ కవర్ పేజీపై దర్శనమిచ్చింది. ఈ ఫోటోషూట్ పూర్తిగా ప్రయోగాత్మకంగా కనిపిస్తోంది. కాగితంతో తయారు చేసిన డిజైనర్ ఆకులు, పూలు .. వాటితోనే అందమైన డిజైనర్ డ్రెస్. దానికి కాంబినేషన్ హీల్స్, తలలో ఇమిడిన అందమైన క్రౌన్ అలంకరణ..ప్రతిదీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎలిజబెత్ మాదిరి మీనాక్షి ఇచ్చిన ఫోజు కుర్రకారును కిల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. మీనాక్షి ని చూడగానే డిజైనర్ రాకుమారిని తలపిస్తోందని అభిమానులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. తన అందం, సొగసుకు తగ్గట్టుగానే.. అందాల మీనాక్షి మతులు చెడగొడుతోందని కుర్రకారు ప్రచారం చేస్తున్నారు.
మీనాక్షి అసలు నటి కావడమే మిరాకిల్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ముంబైలో జరిగిన ఒక నటనా వర్క్‌షాప్‌లో... తెలుగు నటుడిని కలిశాక..అతడు వేరే భాషలో అయినా నటనను కొనసాగించమని నన్ను ప్రోత్సహించాడని తెలిపింది. కొన్ని నెలల తర్వాత ఊహించని కాల్. నా వీడియోలు చూసిన ఓ దర్శకుడు కాల్ చేసారు. ఊహించని అవకాశం నాకు సరైన సమయంలో వచ్చింది అని మీనాక్షి చౌదరి తెలిపింది. తన కుటుంబం గురించి చెబుతూ.. నాన్నగారు మా ఊరి నుంచి మొదటి ఆఫీసర్. అమ్మకు చదువు లేకపోయినా పిల్లలను చదివించడానికి చాలా శ్రమించింది. మేం ఈ స్థాయిలో ఉండటానికి కారణం నాన్న కష్టం.. త్యాగం. వారి కుమార్తెగా ఉన్నందుకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని అని మీనాక్షి చెప్పింది.