మెగా ప్రిన్స్‌ పెళ్లి ఏర్పాట్ల‌లో త‌గ్గేదేలే

ఇటలీలోని టస్కానీలో తమ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నార‌ని కొంత కాలంగా కాబోయే దంప‌తుల‌పై వార్త‌లు వ‌స్తున్నాయి.

Update: 2023-10-17 06:35 GMT

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఒక ఇంటివాడ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. తన ప్రేయ‌సి లావ‌ణ్య త్రిపాఠిని అత‌డు పెళ్లాడుతున్నాడు. నవంబర్ 1వ తేదీన వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి వివాహం జ‌ర‌గ‌నుంది.వీరి వివాహ సన్నాహాల్లో భాగంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇంట స్పెష‌ల్ పార్టీ అనంత‌రం ఈ వేడుక‌ల్లో జోష్ మొద‌లైంది.

ఇటలీలోని టస్కానీలో తమ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నార‌ని కొంత కాలంగా కాబోయే దంప‌తుల‌పై వార్త‌లు వ‌స్తున్నాయి. ట‌స్క‌నీలోని విలాసవంతమైన రిసార్ట్‌లలో ఒకటైన బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో హిందూ ఆచారాలకు అనుగుణంగా వివాహ వేడుక నిర్వహిస్తార‌ని స‌మాచారం. ఈ పెళ్లికి మెగా, అల్లు కుటుంబాల నుంచి అంద‌రూ హాజ‌ర‌వుతారు. అలాగే వ‌రుణ్ తేజ్ కి అత్యంత స‌న్నిహితులు, స్నేహితులు వేడుక‌కు ఎటెండ‌వుతార‌ని తెలిసింది. ముఖ్యంగా మెగా హీరోలంతా ఈ వేడుక‌లో చిల్ చేసే వీలుంద‌ని చెబుతున్నారు.

పెళ్లి అంటే ఆషామాషీనా? భారీ ఏర్పాట్ల కోసం ఖ‌ర్చు అదే రేంజులో ఉండ‌నుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి స‌హా మెగా కుటుంబం వేదిక వ‌ద్ద ప్ర‌త్యేక వాహ‌నాల కోస‌మే భారీగా ఖ‌ర్చు చేస్తున్నారని స‌మాచారం. ఇక రిసార్ట్ బ‌డ్జెట్ కోట్ల‌లో ఉంద‌ని తెలుస్తోంది. ఈ రిసార్ట్‌కి మొత్తం కుటుంబం ప్రయాణ ఖర్చులను వరుణ్ తేజ్ భరిస్తాడు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లి వేడుకలను పూర్తిగా ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేశారు.

అంద‌మైన జంట ప్రేమాయ‌ణం ఇటీవ‌ల హాట్ టాపిక్. 2017లో `మిస్టర్` చిత్రీకరణ సమయంలో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ప్రేమలో పడ్డారు. చాలా కాలం దాగుడుమూత‌ల ఆట‌పై మీడియాలో గుస‌గుస‌లు వినిపించాయి. అయినా ఈ జంట‌ స్థిరమైన సంబంధంలో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వీరి నిశ్చితార్థం జరిగింది.

అల్లు వారి ప్రీవెడ్డింగ్ పార్టీ:

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో జరగనుండ‌గా.. అల్లు అర్జున్ -స్నేహా రెడ్డి హోస్ట్ చేసిన వారి ప్రీ-వెడ్డింగ్ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఈ పార్టీకి ప‌లువురు అతిథులు హాజరయ్యారు. అల్లు హోస్ట్ చేసిన ప్రీ-వెడ్డింగ్ పార్టీకి నితిన్, సాయి ధరమ్ తేజ్, ఉపాసన కొణిదెల, నిహారిక కొణిదెల వంటి ప్రముఖ అతిథులు హాజరయ్యారు. పార్టీలో రామ్ చరణ్ మిస్స‌య్యారు. అద్భుత‌మైన పార్టీని ఇచ్చిన‌ అల్లు, స్నేహలకు వరుణ్ తేజ్ కృతజ్ఞతలు తెలిపాడు. కెర‌ర్ మ్యాట‌ర్ కి వ‌స్తే వ‌రుణ్ తేజ్ - మానుషి చిల్ల‌ర్ జంట‌గా న‌టించిన త‌దుప‌రి చిత్రం విడుద‌ల‌కు రావాల్సి ఉంది.

Tags:    

Similar News