మెగాస్టార్‌ కి ఒకే సినిమాతో బ్లాక్ బస్టర్‌, డిజాస్టర్‌!

దాదాపు రూ.50 కోట్ల వసూళ్లను ఈ సినిమా నమోదు చేసినట్లు మలయాళ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Update: 2024-02-28 10:25 GMT

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టీ తాజా చిత్రం బ్రహ్మ యుగం సినిమా కేరళలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బ్లాక్ అండ్‌ వైట్ లో వచ్చిన ఈ సినిమా కు కేరళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాదాపు రూ.50 కోట్ల వసూళ్లను ఈ సినిమా నమోదు చేసినట్లు మలయాళ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.


బ్రహ్మయుగం సినిమాను తెలుగులో విడుదల చేయాలనే ఆలోచన మొదట చేయలేదు. కానీ కేరళలో విడుదల అయిన తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు హడావుడిగా హక్కులు కొనుగోలు చేసి డబ్బింగ్‌ చెప్పించి గత వారం ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది.

మలయాళ వర్షన్‌ రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, తెలుగు వర్షన్‌ దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. మినిమం కలెక్షన్స్‌ ను కూడా రాబట్టలేక పోయింది. డబ్బింగ్‌, పబ్లిసిటీ ఖర్చులు కూడా సితార వారికి వచ్చి ఉంటాయా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

స్లో కథనం, సీరియస్‌ కాన్సెప్ట్‌ మూడు పాత్రలు మాత్రమే ఉండే ఈ హర్రర్‌ బ్యాక్‌ డ్రాప్ మూవీని తెలుగు ప్రేక్షకులు స్వీకరించలేదు. ఇంతటి ప్రయోగాత్మక సినిమాను చూడటం మా వల్ల కాదు బాబోయ్‌ అన్నట్లుగా తెలుగు ప్రేక్షకులు తిరష్కరించారు.

మమ్ముట్టీ ఈ మధ్య కాలంలో తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన మంచి కంటెంట్‌ తో వచ్చి ఉంటే కచ్చితంగా మినిమం వసూళ్లు రావడం ఖాయం. కానీ ఆయన నుంచి వచ్చిన ఈ సినిమా కంటెంట్‌ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి చాలా దూరంగా ఉంది. అందుకే అక్కడ బ్లాక్ బస్టర్‌ కాగా ఇక్కడ డిజాస్టర్‌ అయ్యింది.


Full View


Tags:    

Similar News