క్యూట్ హీరోయిన్.. బ్యాచిలర్ పార్టీలో బిజీబిజీగా..

మేఘా ఆకాష్ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. పెద్దగా హిట్స్ లేకయినా తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది

Update: 2024-09-02 13:08 GMT

మేఘా ఆకాష్ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. పెద్దగా హిట్స్ లేకయినా తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘లై’ సినిమాతో నితిన్ సరసన తన సినీ ప్రయాణం ప్రారంభించిన ఆమె, తర్వాత ‘చల్ మోహన్ రంగ,’ ‘మనుచరిత్ర,’ ‘రావణాసుర,’ ‘డియర్ మేఘ’ వంటి పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.

తెలుగు సినిమాల్లోనే కాకుండా, తమిళ చిత్రాల్లో కూడా నటిస్తూ, తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక అతికొద్ది కాలంలోనే మేఘా ఆకాష్ వివాహ వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. మొదట ఆమె ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు రాగా వాటిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

కానీ ఇటీవల ఆమె ఈ వార్తలను నిజం చేస్తూ, సాయి విష్ణు అనే వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోవడంతో, ఈ వార్తలకు ఒక క్లారిటీ లభించింది. మేఘా ఆకాష్ తన నిశ్చితార్థ వేడుక ఆగస్టు 23న జరుపుకున్నట్లు ప్రకటించడంతో పాటు తన కాబోయే జీవిత భాగస్వామిని కూడా సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది.

ప్రస్తుతం ఆమె బ్యాచిలరెట్ పార్టీ కోసం తన స్నేహితులతో కలిసి శ్రీలంక వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. స్పెషల్ పోటోలను కూడా పోస్ట్ చేసింది. వధువు కానున్నట్లు ఒక స్పెషల్ పార్టీ కూడా జరిగిందట. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న నెటిజన్లు మేఘాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులకు ఇష్టమైన ఈ నటికి నిశ్చితార్థం జరగడంతో అభిమానులు ఒక్కసారిగా స్టన్ అయ్యారు.

ఇక మేఘా ఆకాష్ సినిమా కెరీర్ లో ఇప్పటివరకు కమర్షియల్ గా ఒక్క సక్సెస్ కూడా చూడలేదు. అమ్మడి వయసు ప్రస్తుతం 28. ఇక కెరీర్ పై ఫోకస్ పెంచుతోంది అని అనుకుంటున్న తరుణంలో పెళ్లికి సిద్ధమైంది. అయితే పెళ్లి అనంతరం అమ్మడు మళ్ళీ సినిమాల్లో కొనసాగుతుందో లేదో చూడాలి. కొందరు పెళ్లి తరువాత కూడా ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News