ఆ స్పై యాక్షన్ ప్రాంచైజీ కోసం 3000 కోట్లా?
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ప్రాంచైజీ మిషన్ ఇంపాజిబుల్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ప్రాంచైజీ మిషన్ ఇంపాజిబుల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ మార్కెట్ నే షేక్ చేసిన ప్రాంచైజీ ఇది. హాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు వరల్డ్ బాక్సాఫీస్ వద్దనే మిషన్ ఇంపాజిబుల్ అనేది ఓ బ్రాండ్. ఆ ప్రాంచైజీ నుంచి సినిమా రిలీజ్ అవుతుందంటే? ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇప్పటివరకూ ఈ ప్రాంచైజీ నుంచి ఏడు చిత్రాలు రిలీజ్ అయిన సంచలన విజయాలు నమోదు చేసాయి.
తాజాగా ఎనిమిదవ ఎడిషన్ సిద్దమవుతోంది. `మిషన్ : ఇంపాజిబుల్ -8` గా 2025 మే లో ప్రేక్షకుల ముందుకొస్తుంది. టామ్ క్రూజ్, హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్, వెనెస్సా కిర్బీ, ఎసై మోరేల్స్, పోమ్ క్లెమెంటీఫ్, హెన్రీ సెర్నీ లాంటి గ్రేట్ ఆర్టిస్టులు ఇందులో భామమయ్యారు. టామ్ క్రూజ్ నాయకత్వంలో స్పై టీమ్ పోరాటాలు పీక్స్ లో ఉండబోతున్నాయి. కళ్లు చెదిరే సన్నివేశాలు..ఒళ్లు గగుర్లు పొడిచే సీన్స్ తో నెక్స్ట్ లెవల్ లో ఎనిమిదవ ఎడిషన్ ఉండబోతుంది.
క్రిస్టోఫర్- మెక్‌క్వారీ ద్వయం సంయుక్తంగా దర్శకత్వం వహిస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ ని భారీ బడ్జెట్ తో రూపొందు తుంది. ఈ సినిమా కోసం దాదాపు 3000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాకి సంబంధించిన సీజీ వర్క్ ఇతర టెక్నికల్ పనులు ఉండటంతోనే ఇంత సమయం పడుతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.
ప్రేక్షకుల అంచనాలకు మించి యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేయనున్నారు. ఈసారి చిత్రాన్ని ఇండియాలో ప్రత్యేకంగా ప్రమోట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారుట. టామ్ క్రూజ్ అండ్ టీమ్ ఇండియా వచ్చి ప్రచారం చేయాలని చూస్తున్నారుట.