ప్రమోషన్స్ సరే.. రిలీజ్ ఎప్పుడు జాతిరత్నం గారు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది యువ హీరోలు చేసే ప్రమోషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి

Update: 2023-08-05 09:38 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది యువ హీరోలు చేసే ప్రమోషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. జనాల్లో చాలా స్మూత్ గా చేరిపోయి.. సినిమాలకు కావాల్సినంత బజ్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. విజయ్ దేవరకొండ అందులో ఒక డిఫరెంట్ ట్రాక్ సెట్ చేసుకోగా ఆ తర్వాత అదే తరహాలో నవీన్ పోలిశెట్టి కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు.

అతనికి యువతలో అయితే మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంది. జాతిరత్నం సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సొంతం చేసుకున్న ఈ హీరో ఇప్పుడు 'మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి' అనే సినిమాతో రెడీ అవుతున్నాడు. ఈ సినిమాపై కూడా మొదట్లో కొంత ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వచ్చాయి. కానీ సినిమా విడుదల డేట్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వకపోవడంతో మెల్లగా మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.

ఎప్పటిలానే నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ సినిమా విషయంలో కూడా చాలా ఆలస్యం అయితే చేస్తోంది. పోనీ రిలీజ్ డేట్ వాయిదా పడిన పరవాలేదు కానీ ఎంత టైం తీసుకుంటున్నారు అనే విషయంలో కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. అసలు ఈపాటికే సినిమా విడుదల కావాల్సింది. ఇక ఆగస్టు రెండో వారంలో వస్తుందని అన్నారు. మళ్లీ ఆ తర్వాత ఆ డేట్ కు కూడా వచ్చే అవకాశం లేదని క్లారిటీ వచ్చింది.

ఇక ఫైనల్ గా ఇప్పుడు ఆగస్టు 18 రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్ వస్తోంది. అంతా బాగానే ఉంది కానీ విడుదల డేట్ చెప్పకుండా ప్రమోషన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. నవీన్ పోలిశెట్టి ఇటీవల కొన్ని కాలేజీలు కూడా తిరిగి సినిమాకు హైప్ పెంచే అయితే ప్రయత్నం చేశాడు. అలాగే టీవీ షోలలో కూడా అతను సినిమా గురించి రకరకాల కంటెంట్ తో అయితే ప్రమోట్ చేస్తున్నాడు.

రీసెంట్ గా స్టార్ మా లో కూడా అతను ఒక ప్రోగ్రాం లో సందడి చేశాడు. ఇదంతా బాగానే ఉంది కానీ సినిమా రిలీజ్ డేట్ చెప్పకుండా ఇలా హడావిడి చేస్తే ఏం లాభం అనే విధంగా కామెంట్స్ వినపడుతున్నాయి. ఒక విధంగా నవీన్ పోలిశెట్టి తన బాధ్యతను కరెక్ట్ గానే నిర్వర్తిస్తున్నాడు. కానీ అతనికి సరైన సపోర్ట్ మాత్రం దొరకడం లేదు అని కూడా అనిపిస్తోంది. UV క్రియేషన్స్ ప్రభాస్ లాంటి పెద్ద సినిమాల విషయంలోనే కాకుండా ఇలా చిన్న సినిమాల విషయంలో కూడా అదే తరహాలో కొనసాగుతూ ఉండడం సినిమాలకు పెద్ద మైనస్ అవుతోంది.

Tags:    

Similar News