స్వాతితో పెళ్లి గురించి నవీన్ ఏమన్నాడంటే...!
మంత్ ఆఫ్ మధు చిత్ర ప్రమోషన్ లో భాగంగా నవీన్ మాట్లాడుతూ తమ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి
నవీన్ చంద్ర, స్వాతి జంటగా నటించిన మంత్ ఆఫ్ మధు చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వీరిద్దరు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా వీరిద్దరూ గతంలో కలిసి నటించిన సమయంలో వచ్చిన వార్తల గురించి ప్రధాన చర్చ జరుగుతోంది.
మంత్ ఆఫ్ మధు చిత్ర ప్రమోషన్ లో భాగంగా నవీన్ మాట్లాడుతూ తమ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరం కలిసి త్రిపుర సినిమా కోసం వర్క్ చేశాం. అప్పటి నుండే మా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతూ వస్తోందని నవీన్ పేర్కొన్నాడు. మళ్లీ స్వాతితో కలిసి నటించడం సంతోషంగా ఉందని కూడా నవీన్ పేర్కొన్నాడు.
త్రిపుర సినిమా లో నటిస్తున్న సమయంలో స్వాతి మరియు నవీన్ చంద్ర ల పెళ్లి అయిందనే వార్తలు వచ్చాయి. అప్పుడు వచ్చిన వార్తల గురించి నవీన్ స్పందిస్తూ... షూటింగ్ సమయంలో మేము ఇద్దరం పెళ్లి డ్రెస్ లో ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ సమయంలో చాలా మంది ఇద్దరం పెళ్లి చేసుకున్నామని భావించారు.
ఆ తర్వాత అదే ఫోటోతో ఒక పోస్టర్ రావడంతో అందరికి అర్థం అయింది. అది సినిమా షూటింగ్ లో భాగం అని తెలియడంతో ఆ తర్వాత చాలా మంది ఆవిషయం గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పటికి కూడా కొందరు అప్పట్లో స్వాతి ని పెళ్లి చేసుకున్నారా అన్నట్లుగా అనుమానంతో ప్రశ్నిస్తూనే ఉంటారు.
మేము ఇద్దరం కూడా అప్పట్లో వచ్చిన పెళ్లి వార్తలను లైట్ తీసుకున్నాం. ఇద్దరం కూడా చాలా లైట్ గానే ఆ విషయం పట్ల స్పందించాం. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అనుకుని నవ్వుకున్నాం అని నవీన్ చంద్ర అన్నాడు. 'మంత్ ఆఫ్ మధు' సినిమాతో మరోసారి మేము ఇద్దరం ప్రేక్షకులను అలరిస్తామని నవీన్ చంద్ర హామీ ఇచ్చాడు.