ట్రైలర్ టాక్: ఆలు మగల గొడవల్లోకి అమెరికా అమ్మాయి?
తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో పాత్రల ప్రవర్తన ఎంతో నేచురల్ గా ఆకట్టుకుంది. ముఖ్యంగా కలర్స్ స్వాతి.. నవీన్ చంద్ర ఇద్దరూ పూర్తిగా డీగ్లామరస్ పాత్రల్లో కనిపించారు.
భార్యాభర్తల గొడవలు చిరాకులు పరాకులు వగైరా వగైరా చాలా కామన్. కానీ కొందరి విషయంలోనే అవి పూర్తిగా బ్రేకప్ వరకూ వెళుతుంటాయి. ఈరోజుల్లో ఈ తరహా గొడవలు మరీ ఎక్కువయ్యాయి. బ్రేకప్ లు రొటీన్ గా మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో బంధాలకు విలువ లేకుండా పోతోందని పెద్దలు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కలర్స్ స్వాతి-నవీన్ చంద్ర మధ్య అదే సమస్య. ఈ జంట నటిస్తున్న 'మంత్ ఆఫ్ మధు' భార్యాభర్తల గొడవలు బ్రేకప్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. ఆలు మగల గొడవలు కోర్టు గడపకెక్కిన క్రమంలోనే అమెరికా అమ్మాయి(శ్రేయా నవీలే) మధు అతడి(నవీన్ చంద్ర) లైఫ్ లోకి వెళుతుంది. చివరిసారి కలిసినప్పుడు ఏదో బాధలో ఉన్నావ్! అంటూ ఎంట్రీ ఇస్తుంది. అదంతా సరే కానీ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి- నవీన్ చంద్ర మధ్య గొడవలకు కారణమేంటి? విడిపోయే వరకూ పరిస్థితి ఎందుకు వెళ్లిందో తెలియాలంటే 'మంథ్ ఆఫ్ మధు' చూడాల్సిందే.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో పాత్రల ప్రవర్తన ఎంతో నేచురల్ గా ఆకట్టుకుంది. ముఖ్యంగా కలర్స్ స్వాతి.. నవీన్ చంద్ర ఇద్దరూ పూర్తిగా డీగ్లామరస్ పాత్రల్లో కనిపించారు. ఇందులో పాత్రలన్నీ సహజసిద్ధంగా కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు..ఈ చిత్రంలో శ్రేయ నవిలే ఎన్నారై పాత్రలో నటించింది. ట్రైలర్‌ను మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆవిష్కరించారు.
అయితే ఈ సినిమా కథలో మధుసూదనరావు (నవీన్ చంద్ర) ఎందుకు ఆల్కహాలిక్ గా మారాడు? అసలు భార్య (స్వాతి)తో సమస్య ఏంటి? అన్నది తెరపైనే చూడాలి. అమెరికా నుంచి భారతదేశంలో ల్యాండయిన ఎన్నారై మధుమతి(శ్రేయా నవేళి) నటన ఎంతో ప్లెజెంట్ గా ఆకట్టుకుంది. ఆ ముగ్గురి ప్రయాణంపైనే ట్రైలర్ ని ఆసక్తికరంగా కట్ చేసారు. శ్రీకాంత్ నాగోతి రచన టేకింగ్ ఆకట్టుకున్నాయి. అచ్చు రాజమణి సంగీతం అస్సెట్. యశ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా అక్టోబర్ 6న విడుదల కానుంది.