భగవంత్ కేసరి.. స్టేజ్‌పైనే నోరు జారిన తమన్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ సారి బ్లాక్ బాస్టర్ హిట్ పాటలతో ట్రెండ్ అయితే మరోసారి కాపీ క్యాట్ అంటూ ట్రోల్ అవుతుంటారు
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ సారి బ్లాక్ బాస్టర్ హిట్ పాటలతో ట్రెండ్ అయితే మరోసారి కాపీ క్యాట్ అంటూ ట్రోల్ అవుతుంటారు. అప్పుడప్పుడు ఆయన మాట్లాడే మాటలు కూడా మరింత వైరల్ అవుతుంటాయి. తాజాగా భగవంత్ కేసరి సినిమా సక్సెస్ మీట్లో ఆయన చేసిన కామెంట్స్ చర్చకు దారీ తీశాయి.
వివరాళ్లోకి వెళితే.. ఫిల్మ్ ఇండస్ట్రీ.. ఎన్ని ప్రశంసలను ఇస్తుందో.. అన్నే విమర్శలను కూడా ఇస్తుంది. హీరోలు, దర్శకులు, హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్లు ఇలా సినీ తారలు.. తమ ప్రొఫెషనల్ వర్క్ లేదా పర్సనల్ లైఫ్‌లోగానీ ఎంతటి క్రేజ్ సంపాదించుకుంటారో.. అలానే కొన్ని సందర్భాల్లో తమ బిహేవియర్‌తో విమర్శలను కూడా ఎదుర్కొంటుంటారు. అందుకే ప్లేస్ ఏదైనా ఈ తారలంతా తమ చేష్టలు - మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పబ్లిక్ పేస్‌లో.
అక్కడ ఏమాత్రం కాస్త తేడా కొట్టిన ఇక నెటిజన్లు ఓ ఆటాడేసుకుంటారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి తన మాటలతో చర్చనీయాంశంగా మారారు. "ట్విట్టర్ తెరిస్తే నా కొడుకులు ఏదేదో వాగుతున్నారు, వాళ్లకేం తెలుసంటూ" అంటూ స్టేజ్‌పై సీరియస్‌గా కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సాధారణంమగా తమన్ ఎక్కువగా నెగెటివిటీని ఎదుర్కొంటారన్న సంగతి తెలిసిందే. ఆయన వర్క్‌ను తక్కువ చేస్తూ పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు కురిపిస్తుంటారు. దానిని ఉద్దేశించే తమన్ సక్సెస్ మీట్లో ఇలా వ్యాఖ్యలు చేశారు. కాగా, తమన్ చేసిన కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ పబ్లిక్ ఫిగర్ ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఇలా ఘాటుగా మాట్లాడటం సరికాదని అంటున్నారు.
ఇకపోతే భగవంత్ కేసరికి ఆయన అందించిన మ్యూజిక్ ప్లస్‌గా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగుందని అంటున్నారు. అయితే ఆయన గత సినిమా స్కంద సినిమా విషయంలో మాత్రం నెగిటివిటీని ఎదుర్కొన్నారు. ఆ చిత్ర దర్శకుడు బోయపాటి కూడా పరోక్షంగా తమన్‌పై కామెంట్స్ చేయడం కూడా వైరల్‌గా మారింది.