చైతూ ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఏమేం చెప్పిందంటే
నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది
నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య, సాయి పల్లవిని ఇంటర్య్యూ చేశాడు.
ఇంటర్వ్యూలో భాగంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలను చైతన్య పల్లవిని అడిగాడు. యాక్టింగ్ కాకుండా సాయి పల్లవికి మరేదైనా ప్యాషన్ ఉందా అని అడిగితే తేనె టీగల పెంపకమంటే ఇష్టమని, రీసెంట్ గా దాన్ని మొదలుపెట్టినట్టు చెప్పింది. వెంటనే నాగ చైతన్య అందుకుని పల్లవికి బన్ మస్కా, కొబ్బరి నీళ్లంటే కూడా ఇష్టమని, అన్నింటికంటే నిద్ర అంటే బాగా ఇష్టమని, రాత్రి 9 గంటలైతే ఎక్కడున్నా సరే నిద్రపోతుందని ఈ సందర్భంగా చెప్పాడు.
సాయి పల్లవి దర్శకత్వంలో సినిమా ఎప్పుడొస్తుందని అడగ్గానే నాకసలు ఆ ఆలోచనే లేదు, చేయనని చెప్పింది. అందుకు నాగ చైతన్య లేదు, నువు అబద్దాలు చెప్తున్నావు. ఎప్పటికైనా సినిమా తీస్తా, అందులో నన్ను యాక్టర్ గా తీసుకుంటానని కూడా చెప్పావన్నాడు. అంతేకాదు ఈ సందర్భంగా తనకు ఏ ఫిక్షనల్ క్యారెక్టర్ తో డిన్నర్ చేయాలనుందని చైతన్య అడగ్గా, అమెరికన్ యానిమేటెడ్ సిట్ కామ్ అయిన సింప్సన్స్ ఫ్యామిలీతో చేయాలనున్నట్లు తెలిపింది.
చైతన్య డ్యాన్స్ చూసి మీకేమనిపించిదని అడిగిన ఓ అభిమాని ప్రశ్నకు సాయి పల్లవి సమాధానమిస్తూ, గతంలో చైతన్య డ్యాన్స్ చేస్తూ అప్పుడప్పుడు బ్యాక్ స్టెప్ వేసేవాడు కానీ నమో నమః సాంగ్ కు మాత్రం ముందుకు దూకి మరీ డ్యాన్స్ చేశాడని చెప్పిన సాయి పల్లవి, శ్రీకాకుళం యాసలో సీన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డానని, కానీ గతంలో తెలంగాణ యాస నేర్చుకున్నట్టే ఇప్పుడు ఇది కూడా నేర్చుకున్నట్టు వెల్లడించింది.
తండేల్ సెట్స్ లో చైతన్య మీకేమైనా అబద్దం చెప్పాడా అనే ప్రశ్నకు సమాధానంగా తాను అక్కడలేని టైమ్ చూసుకుని పల్లవి నన్ను పిలిచి ఆ సీన్ లో ఇలా చేద్దాం, అలా చేద్దామని చెప్తోంది అని అంటుంటాడు. ఎప్పుడైతే నా మాట వినిపిస్తుందో వెంటనే సైలెంట్ అయిపోతాడని చెప్పిన సాయి పల్లవి, షూటింగ్ లేకుండా ఉంటే ఖాళీ టైమ్ లో సినిమాలు చూస్తానని, వంట చేయాలనుకున్నప్పటికీ చేయలేను కాబట్టి ఆర్డర్ పెట్టుకుని తినేస్తానని, తోట పని చేస్తూ క్యారెట్లు పండిస్తానని చెప్పింది.
వాట్సాప్ లో కోతులు స్టిక్కర్స్ ను ఎక్కువగా వాడతానని చెప్పిన సాయి పల్లవి ఎవరైనా సరే నలిగిపోయిన బట్టలు వేసుకుంటే తనకు నచ్చదని, తన ఫ్యామిలీలో ఎవరైనా అలా కనిపిస్తే వెంటనే వాటిని సెట్ చేయాలని ట్రై చేస్తానని చెప్పడంతో వెంటనే చైతన్య అందుకుని అబ్బాయిలూ విన్నారుగా ఈసారి సాయిపల్లవిని కలిసే ముందు నీట్ గా ఐరన్ డ్రెస్ వేసుకుని వెళ్లి ఇంప్రెస్ చేయండని సరదాగా చిట్ చాట్ ను ముగించాడు.