పెద్ద హీరోల సినిమాల్లో ఇంకేం అక్కర్లేదా?

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.

Update: 2024-10-21 12:04 GMT

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఆయన సినిమాలకు సంబంధించిన అంశాలపై చాలా ఓపెన్‌గా మాట్లాడేస్తుంటారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు తన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుంటాయి. సినిమా చూడ్డానికి ఓ ఫ్యామిలీ 1500 కూడా పెట్టలేదా అంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై చాలామంది నాగవంశీని తప్పుబట్టారు. 1500 రూపాయలు అంటే తక్కువ మొత్తమా.. పేద, మధ్య తరగతి వాళ్లకు ఆ డబ్బులు ఎంత ముఖ్యం.. సినిమా కోసం అంత ఈజీగా ఎలా ఖర్చు పెడతారంటూ ఆయన్ని ప్రశ్నించారు. ప్రేక్షకుల పట్ల చులకనభావంతో మాట్లాడుతున్నారంటూ నాగవంశీ మీద మండిపడ్డారు. దీని మీద ఎక్స్‌లోనే కాక వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో చాలా చర్చ జరిగింది.

కాాగా ఇప్పుడు నాగవంశీ ఓ పాడ్ కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు సైతం చర్చకు దారి తీశాయి. పెద్ద హీరోల సినిమాల్లో కథ గురించి ఎవరూ పట్టించుకోరంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ‘‘పెద్ద హీరో సినిమా ఎందుకు తీస్తాం. పెద్ద హీరో సినిమాకు ప్రేక్షకులు ఎందుకు వస్తారు? హీరోయిక్ హైస్ ఉండాలి. హీరోయిజం చూపించాలి. హీరో బాగా కామెడీ చేయాలి. డ్యాన్స్ చేయాలి. అవి ఉంటే చాలు కదా.

కథ.. దాని బలం.. దాని స్క్రీన్ ప్లే.. దాని తొక్క.. దాని తోలు.. ఎవడు అడిగాడు.. ఎవడిక్కావాలి’’ అంటూ ఈ పాడ్‌కాస్ట్‌లో నాగవంశీ కామెంట్ చేశారు. ఐతే ఈ వ్యాఖ్యలను మెజారిటీ నెటిజన్లు తప్పుబడుతున్నారు. పెద్ద హీరో సినిమాలో కమర్షియల్ అంశాలను కోరుకునే అభిమానులు కొంతమంది ఉంటారని.. అంతమాత్రాన అందరూ అవే ఆశిస్తారని.. కథ సహా వేరే అంశాలను పట్టించుకోరని అనుకోవడం పొరబాటని.. ‘గుంటూరు కారం’ లాంటి సినిమాలను ఇలా తీసే బోల్తా కొట్టారంటూ నాగవంశీ మీద కౌంటర్లు వేస్తున్నారు.

Tags:    

Similar News