చైత‌న్య‌లో ఆ ల‌క్ష‌ణలున్నాయా శోభిత‌?

మ‌రి నాగ‌చైత‌న్య‌ను పెళ్లి చేసుకుంటోన్న తెలుగు న‌టి శోభిత దూళిపాళ అబ్బాయి విష‌యంలో ఎలాంటి ల‌క్ష‌ణాలు కోరుకుంది? అంటే ఆమె మాట‌ల్లోనే...

Update: 2024-10-06 10:25 GMT

కాబోయే వాడు విష‌యంలో అమ్మాయిలంతా కొన్ని క్వాలిటీలు కోరుకుంటారు. జీవిత భాగ‌స్వామి ఇలా ఉంటే? బాగుంటుంద‌నే ఐడియాతో స‌రైన భాగ‌స్వామి కోసం వెతుకుతుంటారు. అలాంటి వారు తార‌స ప‌డిన‌ప్పుడు? నో చెప్ప‌కుండా ముందుకెళ్తుంటారు. మ‌రి నాగ‌చైత‌న్య‌ను పెళ్లి చేసుకుంటోన్న తెలుగు న‌టి శోభిత దూళిపాళ అబ్బాయి విష‌యంలో ఎలాంటి ల‌క్ష‌ణాలు కోరుకుంది? అంటే ఆమె మాట‌ల్లోనే...

`ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. ఇత‌రుల ప‌ట్ల‌, ద‌య‌, క‌రుణ ఉండాలి. ఈ జీవితం చాలా చిన్న‌ది అనే విష‌యాన్ని గుర్తించి ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదించే ల‌క్ష‌ణాలున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాల‌నుకున్నా. చైత‌న్య విష‌యానికి వ‌స్తే త‌ను చాలా మ‌ర్యాద‌స్తుడు. ఎంతో హుందాగా ప్ర‌వ‌ర్తిస్తాడు. ఎప్పుడూ ప్ర‌శాంతంగా, కూల్ గా ఉంటాడు. అత‌నిలో ఈ క్వాలిటీస్ బాగా న‌చ్చుతాయి` అన్నారు.

అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్య‌-న‌టి శోభిత ధూళిపాళ ప్రేమ వివాహం చేసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఎంగేజ్ మెంట్ తంతు కూడా ముగిసింది. పెళ్లికి మంచి ముహూర్తం వెతికే ప‌నిలో రెండు కుటుంబాలున్నాయి. ఇప్పుడా తేది ఎప్పుడొస్తుందా? అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నాగచైత‌న్య‌-శోభిత విశేషాలు నెటి జ‌నుల్ని ఆక‌ట్టుకుంటున్నాయి.

ప్రోఫెష‌నల్ గా ఇద్ద‌రు బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. శోభిత బాలీవుడ్, హాలీవుడ్ లో సైతం న‌టించింది. తెనాలికి చెందిన శోభిత వైజాగ్ లో చ‌దువుకుంది. సినిమాలంటే ఆస‌క్తితో ముందుగా మోడ‌లింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అటుపై నేరుగా బాలీవుడ్ సినిమాల్లోనే న‌టించింది. అక్కడ నుంచే టాలీవుడ్ కి వ‌చ్చింది.

Tags:    

Similar News