నాగ చైతన్యకి సండే వస్తే పండగే!
అటు ఆదివారం వస్తే రుచి మాత్రమే చూస్తారుట. మిగతా రోజుల్లోకేవలం వెజ్ కే పరిమితమట.
సెలబ్రిటీలు ఫిట్ నెస్ ..డైట్ విషయంలో ఎంత కఠినంగా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. జిమ్ముల్లో గంటలు కసరత్తులు చేస్తుంటారు. పరిమితంగానే ఆహారం తీసుకుంటారు. డైటీషయన్ చెప్పిన ప్రతీది క్రమం తప్పకుండా పాటిస్తారు. సెలబ్రిటీ వరల్డ్ లో రాణించాలంటే ఇవన్నీ తప్పక చేయాలి. ప్రత్యేకంగా ఆహారం విషయంలో కొంత మంది స్టార్లు నోరుకట్టేసుకుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకూ ప్రతీది కొలతలు ప్రకారం తీసుకుంటారు.
అందులోనూ నాగచైతన్య ఫుడ్ విషయంలో మరింత కఠినంగా ఉంటారుట. ఆయన నాన్ వెజ్ తీసుకోవడం అన్నది చాలా అరుదు. అటు ఆదివారం వస్తే రుచి మాత్రమే చూస్తారుట. మిగతా రోజుల్లోకేవలం వెజ్ కే పరిమితమట. అలాగని అది కూడా కడుపు నిండా తీసుకోడుట. చాలా తక్కు మోతాదులోనే ఫుడ్ తీసుకుంటాడు. రెగ్యులర్ డేస్ కన్నా! ఆదివారం కాస్త ఎక్కువగా తీసుకుంటారుట. నాన్ వెజ్ కన్నా వెజ్ ఎక్కువగా ఇష్టపడతారుట.
అలాంటి కాంబినేషన్ ఉన్న వాటినే తింటాడుట. ఆ ఫ్యాషన్ తోనే వెజ్ రిలేటెడ్ వంటకాలతో కొత్తగా ఫుండ్ సప్లై బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. వివిధ దేశాల వెజ్ వంటకాలు చైతన్య రెస్టారెంట్ లో చాలా స్పెషల్ గా చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
వెజ్ లోనే డిఫరెంట్ ఐటమ్స్ ..కొత్తగా ఉండేవి చేస్తుంటారుట. చైతన్యని ఇప్పటివరకూ నటుడిగానే చూసాం. కొత్తగా ఫుడ్ బిజినెస్ లోకి దిగడంతో! అందులోనూ చైతన్య చాలా యాక్టివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
తన బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం యూ ట్యూబర్లకి టచ్ లో కి వెళ్తున్నాడు. తమ రెస్టారెంట్ ఫుడ్ గురించి ప్రత్యేకంగా చైతన్య ఎంతో బాగా వివరిస్తున్నారు కూడా. చైతన్య మంచి బిజినెస్ మెన్ గానూ చెబుతారు. స్టడీస్ పూర్తిచేసింది బిజినెస్ లోనే. ప్రస్తుతం నటుడిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో కొత్త సినిమా షూట్ కి రెడీ అవుతున్నారు.