మాస్ 4K కలెక్షన్స్.. ఇది అస్సలు ఊహించలేదే..

కింగ్ నాగార్జున కెరియర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా మాస్ మూవీ నిలిచింది.

Update: 2024-08-30 04:16 GMT

కింగ్ నాగార్జున కెరియర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా మాస్ మూవీ నిలిచింది. 2004లో వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ప్రేక్షకులకి కూడా విపరీతంగా కనెక్ట్ అయిపొయింది. ఈ సినిమాలో సీన్స్, డైలాగ్స్ ని తరువాత చాలా మూవీస్ లో డిఫరెంట్ సిచువేషన్స్ కి సరిపోయే విధంగా వాడుకున్నారు. ఇప్పటికి సోషల్ మీడియాలో మాస్ సినిమా డైలాగ్ మీమ్స్ కనిపిస్తూ ఉంటాయి.

అంతలా ప్రేక్షకులకి మాస్ మూవీ ఎక్కేసింది. రాఘవలారెన్స్ ని కూడా దర్శకుడిగా ఈ సినిమా స్టార్ ని చేసేసింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కి మాస్ చిత్రం మంచి మైలేజ్ అందించింది. ఈ సినిమాని తెలుగు ఆడియన్స్ అంత ఈజీగా మరిచిపోరు. ఇదిలా ఉంటే కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా మాస్ 4K వెర్షన్ ని రీరిలీజ్ చేశారు. నాగార్జున బర్త్ డే క్రేజ్ తెలుగు రాష్ట్రాలలో భారీగానే ఉంటుంది.

కానీ ఈ రీరిలీజ్ ని సోషల్ మీడియాలో సరిగా ప్రమోట్ చేయకపోవడం వలన ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ రాలేదు. మాస్ మూవీ రీరిలీజ్ గురించి కరెక్ట్ గా ప్రమోట్ చేసి ఉంటే సినిమాని చూడటానికి ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కూడా భారీగా వచ్చేవారు. అలాగే రీరిలీజ్ కూడా తక్కువ స్క్రీన్స్ కి పరిమితం అయ్యింది. నాని సరిపోదా శనివారం రిలీజ్ ఉండటంతో పబ్లిక్ అటెన్షన్ మొత్తం అటు వైపు వెళ్ళిపోయింది.

ఈ ఇంపాక్ట్ మాస్ 4K కలెక్షన్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 22 లక్షల గ్రాస్ ఫస్ట్ డే కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో 17-18 లక్షల వరకు గ్రాస్ వసూళ్లు సాధించింది. రీరిలీజ్ ట్రెండ్ లో ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. వాటితో పోల్చుకుంటే మాస్ 4Kకి చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయని చెప్పొచ్చు.

అయితే థియేటర్స్ లో 20 ఏళ్ళ తర్వాత ఈ చిత్రాన్ని చూసిన ఆడియన్స్ మాత్రం ఫుల్ గా ఎంగేజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో రీరిలీజ్ అయిన వాటిలో మహేష్ బాబు మురారి అత్యధికంగా 9 కోట్ల వరకు కలెక్షన్స్ చేసింది. ఇంద్ర 4K కి కూడా మంచి వసూళ్లు వచ్చాయి. నెక్స్ట్ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా గబ్బర్ సింగ్ 4K రీరిలీజ్ కాబోతోంది. దీనిపై ఇప్పటికే ప్రమోషన్స్ హంగామా మొదలైంది. మరి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుంది అనేది చూడాలి.

Tags:    

Similar News