#DNS నాగార్జున పర్ఫెక్ట్ ప్లేస్ మెంట్..!

పోటీగా మహేష్ గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, హనుమాన్ సినిమాలు ఉన్నా నా సామిరంగ సినిమా మీద నాగార్జున సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Update: 2024-01-23 12:30 GMT

కింగ్ నాగార్జున ఖాతాలో నా సామిరంగ సూపర్ హిట్ వచ్చి చేరింది. అక్టోబర్ లో మొదలు పెట్టి నవంబర్, డిసెంబర్ లో సినిమా పూర్తి చేసి జనవరి సంక్రాంతికి రిలీజ్ చేసి హిట్ కొట్టడం అనేది నాగార్జున లెక్కకు ఉన్న క్లారిటీ ఎలాంటిదో తెలియచేస్తుంది. సంక్రాంతి సీజన్ ఎన్ని సినిమాలు వచ్చినా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియన్స్ ని అలరిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు నాగార్జున. అందుకే నా సామిరంగ సినిమాను పొంగల్ రిలీజ్ చేశాడు.

పోటీగా మహేష్ గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, హనుమాన్ సినిమాలు ఉన్నా నా సామిరంగ సినిమా మీద నాగార్జున సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా ఫలితం నాగార్జున నమ్మకం నిలబెట్టేలా చేసింది. ఈ సినిమా హిట్ నాగార్జునలో ఫుల్ జోష్ ని నింపింది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన నెక్స్ట్ సినిమా లైన్ లో పెట్టారు. నాగార్జున తన నెక్స్ట్ సినిమా ఒక మల్టీస్టారర్ చేస్తున్నారు.

కోలీవుడ్ హీరో ధనుష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు నాగార్జున. ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నారని తెలిసిందే. సునీల్ నారంగ్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ధనుష్ నాగార్జున శేఖర్ కమ్ముల #DNS అంటూ సినిమా ఈమధ్యనే మొదలు పెట్టారు. అయితే నా సామిరంగ తర్వాత నాగార్జున ఈ సినిమా చేయడం పర్ఫెక్ట్ ప్లేస్ మెంట్ అని చెప్పొచ్చు.

కొన్నాళ్లుగా నాగార్జున సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలు ఇవ్వలేదు. మధ్యలో బంగార్రాజు పర్వాలేదు అనిపించినా నా సామిరంగ హిట్ నాగార్జునకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. అందుకే ఇక మీదట తన మార్క్ సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరించాలని డిసైడ్ అయ్యారు నాగార్జున. ఇక మీదట సినిమాల వేగం కూడా పెంచాలని కూడా నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.

కోలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన స్టార్ డం కొనసాగిస్తున్న ధనుష్ లాస్ట్ ఇయర్ సార్ అంటూ మరో సూపర్ హిట్ కొట్టాడు. ఈమధ్యనే కెప్టెన్ మిల్లర్ అంటూ తమిళ ఆడియన్స్ ని అలరించిన ధనుష్ శేఖర్ కమ్ములతో కలిసి చేస్తున్న సినిమాతో కూడా భారీ టార్గెట్ పెట్టుకున్నారు. ఈ సినిమా తప్పకుండా నాగార్జున ఖాతాలో మరో హిట్ వచ్చేలా చేస్తుందని చెప్పొచ్చు. లవ్ స్టోరీ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల ఈసారి ధనుష్ తో చేస్తున్న సినిమాను కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News