ప్రేక్షకులకు 'గుంటూరు కారం' నిర్మాత సలహా..!

ఆ విషయం పక్కన పెడితే తాజాగా మరోసారి నాగ వంశీ వార్తల్లో నిలిచాడు.

Update: 2024-03-26 10:09 GMT

సాధారణంగా నిర్మాతలు కాస్త తక్కువగా వార్తల్లో ఉంటారు. వారి సినిమాల విడుదల సమయంలో మాత్రమే మీడియా ముందుకు వచ్చి ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే నిర్మాత నాగ వంశీ మాత్రం రెగ్యులర్‌ గా వార్తల్లో ఉంటాడు. ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే విషయాల కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.

సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌ లో ఏడాదికి అర డజనుకు పైగా చిన్న సినిమాలు, మీడియం రేంజ్ బడ్జెట్‌ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న నాగ వంశీ పెద్ద హీరోలతో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందే సినిమాలను నిర్మించే హారిక అండ్‌ హాసిని బ్యానర్‌ వ్యవహారాలను కూడా చూసుకుంటూ ఉంటాడు అనే విషయం తెల్సిందే.

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని బ్యానర్‌ లో రూపొందిన గుంటూరు కారం సినిమా యొక్క ప్రమోషన్‌ వ్యవహారాలు అన్నీ కూడా నాగవంశీ చూసుకున్నాడు. ఆ సినిమా గురించి కొందరు సోషల్‌ మీడియాలో విమర్శలు చేసిన సమయంలో వాటి పై స్పందించడంతో పాటు కొన్ని మీడియా సంస్థలను టార్గెట్‌ చేసి విమర్శలు చేసి వార్తల్లో నిలిచాడు.

ఆ విషయం పక్కన పెడితే తాజాగా మరోసారి నాగ వంశీ వార్తల్లో నిలిచాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగ వంశీ మాట్లాడుతూ... కమర్షియల్‌ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు చూసే సమయంలో లాజిక్స్ వెతక కూడదు. సలార్ సినిమాలో ప్రభాస్ ని చూసి చాలా మంది ఎంజాయ్ చేశారు. కానీ కొందరు మాత్రం ఆ సినిమాలోని సన్నివేశాల్లో లాజిక్ లేదంటూ విమర్శించారు.

గుంటూరు కారం సినిమాలో హీరో తరచు హైదరాబాద్‌ వెళ్లి వస్తూ ఉంటాడు. అంత తక్కువ సమయంలో హైదరాబాద్‌ కి గుంటూరుకి ఎలా తిరుగుతున్నాడు అంటూ లాజిక్ తీసి మాట్లాడారు. సినిమా ఉండే మూడు గంటల్లో హైదరాబాద్‌, గుంటూరు ప్రయాణం మూడున్నర గంటలు చూపించలేం కదా అంటూ నాగ వంశీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మహేష్ బాబు వంటి స్టార్‌ హీరో సినిమాలను చూసే సమయంలో కేవలం ఎంజాయ్‌ చేయాలే తప్ప కథ లో మరియు స్క్రీన్‌ ప్లే లో లాజిక్ లు అస్సలు వెతక వద్దు అంటూ నాగ వంశీ సూచించాడు. ప్రేక్షకులు పెద్ద హీరోల సినిమాలను లాజిక్‌ వెతక్కుండా చూస్తేనే ఎంజాయ్ చేయగలరు అంటూ నాగ వంశీ సలహా ఇచ్చాడు.

Tags:    

Similar News