ఫోటో స్టోరి: న‌మ్ర‌త రాయ‌ల్ లుక్

భారీ క్రిస్ట‌లైన్ ఎంబ్రాయిడ‌రీ వ‌ర్క్ తో రూపొందించిన ఈ డిజైన‌ర్ శారీ, బ్లౌజ్ సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తున్నాయి. న‌మ్ర‌త అందం ధేధీప్య‌మానంగా వెలిగిపోతోంది ఈ డ్రెస్ లో..

Update: 2024-03-13 07:03 GMT

రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. కానీ ఇంకా రాచ‌రిక‌పు పోక‌డ‌లు మాత్రం అలానే ఉన్నాయి. జ‌మీందారీ వ్య‌వ‌స్థ‌ వాస‌న‌లు ఇంకా పోలేదు. ఇదిగో ఇక్క‌డ న‌మ్ర‌త ఫోజులు చూస్తుంటే ఇంకా రాచ‌రికం రాణుల కాలం త‌ల‌పున‌కు రాకుండా ఉండ‌దు. న‌మ్ర‌త ఎంతో రాయ‌ల్ గా క‌నిపిస్తోంది ఈ ఫోజ్‌లో.

 

ఈ స‌మ‌యంలో న‌మ్ర‌త నిలుచున్న చోటు నేప‌థ్యం అలాంటిది. అక్క‌డ అంతా రాయల్ యాంబియెన్స్ క‌నిపిస్తోంది. ఇక న‌మ్ర‌త ఎంపిక చేసుకున్న డిజైన‌ర్ డ్రెస్ కూడా అంతే రాయ‌ల్ లుక్ ని తెచ్చింద‌ని చెప్పాలి. భారీ క్రిస్ట‌లైన్ ఎంబ్రాయిడ‌రీ వ‌ర్క్ తో రూపొందించిన ఈ డిజైన‌ర్ శారీ, బ్లౌజ్ సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తున్నాయి. న‌మ్ర‌త అందం ధేధీప్య‌మానంగా వెలిగిపోతోంది ఈ డ్రెస్ లో..

 

గ‌జ‌ల్ గుప్తా కోచ‌ర్ ద్వారా అద్భుతమైన కొత్త సేకరణ.. ఢిల్లీ గప్‌షప్‌తో అద్భుతమైన సమయాన్ని గడిపాను! అని న‌మ్ర‌త వెల్ల‌డించారు. పింకీరెడ్డి అఫీషియ‌ల్.. బాబి కంధారి.. ఆర్చీమిర్చీ అంటూ కొన్ని ట్యాగుల‌ను కూడా జోడించారు న‌మ్ర‌త‌. ఈసారి ఫ్యాష‌న్ షోలో త‌న స్నేహితుల బృందం కూడా అంతే రాయ‌ల్ గా క‌నిపించారు.

 

ఇటీవ‌లే న‌మ్ర‌త హైద‌రాబాద్ ఔట‌ర్ లో రెండెక‌రాల భూమిని కొన్నారు. అక్క‌డ ఇంకా అద‌నంగా భూమిని కొనుగోలు చేసే ఆలోచ‌న ఉందిట‌. హైద‌రాబాద్ ఔట‌ర్ వేగంగా విస్త‌రిస్తోంది. రియ‌ల్ బూమ్ న‌డుస్తోంది గ‌నుక ఇది ముంద‌స్తు ప్ర‌ణాళిక‌. భ‌విష్య‌త్ లో ఏఎంబి విస్త‌ర‌ణ‌కు ఇది ఉప‌క‌రించ‌వ‌చ్చు. మ‌హేష్ పెట్టుబ‌డుల‌ను మ్యానేజ్ చేస్తూ వాటిని ప‌దింత‌లు వందింత‌లు చేయ‌డంలో న‌మ్ర‌త తెలివితేట‌లు, ప‌నిత‌నం గురించి అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది.

Tags:    

Similar News