NBK109 : 'విజ్జీ' పాపగా తెలుగమ్మాయి..?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే

Update: 2024-03-05 04:56 GMT

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. వరుసగా వీర సింహారెడ్డి, అఖండ, భగవంత్ కేసరి సినిమాలతో హిట్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ఇప్పటి వరకు NBK109 సినిమా గురించి బాబీ సస్పెన్స్ ను కొనసాగిస్తూ వస్తున్నాడు. హీరోయిన్‌ విషయంలో, రిలీజ్ విషయంలో ఇంకా బాలయ్య పాత్ర విషయంలో బాబీ చాలా సీక్రెట్‌ ను కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సీక్రెట్స్ అన్నీ రివీల్‌ అవుతాయా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలోనే భగవంత్‌ కేసరి సినిమాలో విజ్జీ పాత్ర ఎలాగైతే ఉంటుందో అలాంటి పాత్రను NBK109 లో చూపించబోతున్నారట. బాలయ్యకు అత్యంత దగ్గర అయిన ఆ పాత్ర లో తెలుగు అమ్మాయి చాందిని చౌదరిని నటింపజేసేందుకు చర్చలు జరిగినట్లు సమాచారం అందుతోంది.

ఇటీవల చాందిని చౌదరి సన్నిహితుల వద్ద తాను బాలయ్య 109 సినిమాలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఎలాంటి పాత్ర, ఎవరికి జోడీ అనే విషయంలో మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న లీక్ ప్రకారం ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న దుల్కర్ సల్మాన్ కి జోడీగా ఆమె కనిపించబోతుందట.

బాలయ్య మాత్రమే కాకుండా ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్‌, బాబీ డియోల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి తెలుగు అమ్మాయి చాందినికి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ లో ఛాన్స్ రావడం గొప్ప విషయం. కలర్ ఫోటో సినిమా తర్వాత ఈ అమ్మడి స్థాయి పెరిగింది. తాజాగా గామి సినిమాలో ఈ అమ్మడు నటించింది. బాలయ్య సినిమాతో మరింతగా ఈ అమ్మడి కెరీర్‌ ఊపందుకునే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News