నాని - శ్రీకాంత్.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు

నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో ఒక భారీ సినిమా రాబోతుందనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

Update: 2024-08-12 06:28 GMT

నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో ఒక భారీ సినిమా రాబోతుందనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రం గా నిలవనుందని, ఏకంగా రూ.100 కోట్లతో ఈ సినిమాను నిర్మించేందుకు మేకర్స్ రెడీ అయ్యారని టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమా పై రూమర్లు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాపై పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తుండగా, తాజాగా నాని పాత్ర పై ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ లీకైంది. నాని ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారని, ఆ రెండు పాత్రల్లో ఒక పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని సమాచారం. పైగా, ఈ పాత్రలో నాని లుక్ కూడా చాలా కొత్తగా ఉండబోతోందని చెబుతున్నారు. నాని ఈ పాత్ర కోసం ఒక న్యూ మేకోవర్ ను ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కథ 80వ దశకంలో సాగే నేపథ్యంలో ఉండనుందని సమాచారం. శ్రీకాంత్ ఓదెల, నాని కోసం ప్రత్యేకంగా ఈ కథను రాసారని, ఇందులో నిజమైన నాయకుడికి ఐడెంటిటీ అవసరం లేదనే స్లోగన్ పై ఫోకస్ చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కథలో చాలా వేరియేషన్స్ ఉంటాయని కూడా తెలుస్తోంది, అలాగే ఈ చిత్రంలో నాని కొత్తగా కనిపించబోతున్న ఈ లుక్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు.

ఈ చిత్రం పై రోజుకో కొత్త రూమర్ వస్తున్నా, మేకర్స్ మాత్రం దీనిపై స్పందించడానికి ఆసక్తి చూపడం లేదు. దీనితో మరిన్ని వివరాలు తెలియాలంటే కాస్త ఆగాల్సిందే. నాని కొత్త మేకోవర్, డ్యూయెల్ రోల్ లో ఆయన నటన ఈ సినిమాకు ఎలాంటి ప్లస్ అవుతుందో చూడాలి.

ఇక మరోవైపు నాని నటించిన సరిపోదా శనివారం సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే.

ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది యువదర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను DVV దానయ్య నిర్మించారు ఇప్పటికే సినిమాకు సంబంధించిన సాంగ్స్ టీజర్ పోస్టర్లు అన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. చిత్ర యూనిట్ సభ్యులు కూడా వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. ఇంతకుముందు వివేక్ నాని కాంబినేషన్లో వచ్చిన 'అంటే సుందరానికి' సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఇక ఈసారి మాత్రం ఈ కాంబినేషన్ సాలిడ్ సక్సెస్ అందుకోవాలి అని ఫిక్స్ అయింది. మరి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తారో చూడాలి.

Tags:    

Similar News