నాని సినిమాకు అదిరిపోయే ఆఫర్.. కెరీర్ బెస్ట్ డీల్
టాలెంటెడ్ యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరపైకి తీసుకురాబోతున్న 'సరిపోదా శనివారం' సినిమాపై మంచి పాజిటివ్ బజ్ అయితే ఉంది. ఇక మార్కెట్లో డిమాండ్‌కు తగ్గట్టుగా నిర్మాతలు మంచి రేట్లు అయితే చెబుతున్నారు.
నేచురల్ స్టార్ నాని తన ప్రతి సినిమాతో కూడా మార్కెట్ పరిధిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గత ఏడాది అతని నుంచి రెండు సినిమాల వచ్చాయి. ముందుగా దసరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అతనికి మొదటిసారి 100 కోట్ల రుచి చూపించింది. ఆ సినిమా మాస్ ఆడియోన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. నాని క్లాస్ ఆడియన్స్ ను మాత్రమే కాకుండా మాస్ జనాలను కూడా ఎక్కువగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
ఇక గత ఏడాది చివరలో వచ్చిన హాయ్ నాన్న సినిమా కూడా పెట్టిన పెట్టుబడినే వెనక్కి తెచ్చి మరో సక్సెస్ ఇచ్చింది. అయితే అనుకున్నంత స్థాయిలో మాత్రం ఆ సినిమా లాభాలను అందించలేకపోయింది. ఇక నాని తదుపరి సినిమాలపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఆ విధంగా అతను కాంబినేషన్స్ సెట్ చేసుకుంటూ ఉన్నాడు. అలాగే కథల విషయంలో కూడా నాని డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటాడు అని ఇదివరకే కొన్ని ప్రాజెక్టులతో అర్థమయింది.
ఇక రాబోయే సినిమా టైటిల్స్ తోనే అతను ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉన్నాడు. టాలెంటెడ్ యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరపైకి తీసుకురాబోతున్న 'సరిపోదా శనివారం' సినిమాపై మంచి పాజిటివ్ బజ్ అయితే ఉంది. ఇక మార్కెట్లో డిమాండ్‌కు తగ్గట్టుగా నిర్మాతలు మంచి రేట్లు అయితే చెబుతున్నారు.
ఇప్పటికే ఓవర్సీస్ డీల్స్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు కూడా మంచి రేటుకు అమ్ముడయ్యాయి. ఇక నాన్ థియేట్రికల్ గా కూడా నిర్మాత మంచి ప్రాఫిట్ అందుకునే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను దాదాపు 45 కోట్ల డీల్ తో ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
నాని కెరియర్ లోనే ఇది బిగ్గెస్ట్ రికార్డ్. అతని గత సినిమాలకు దాదాపు 25 కోట్ల రేంజ్ లోనే ఓటీటీ బిజినెస్ డీల్స్ జరిగాయి. కానీ ఈసారి మాత్రం మిగతా భాషల్లో కూడా క్రేజ్ అందుకోవడంతో సరిపోదా శనివారం సినిమాకు మంచి ఆఫర్ దక్కింది. సౌత్ నార్త్ లో అన్ని భాషల్లో కలుపుకొని నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.