ఎన్టీఆర్ ని వాడుకోని బామ్మర్ధి

నార్నే నితిన్ మొదటి సినిమా శ్రీశ్రీశ్రీ రాజావారు

Update: 2023-07-14 06:19 GMT

సినిమా ఇండస్ట్రీలో చిన్న లింక్ ఉంటే చాలు ఆ లింక్ ను పట్టుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న వారు చాలా మంది ఉంటారు. హీరో నుంచి మొదలుకుని కో డైరెక్టర్ వరకు ఇండస్ట్రీ పరిచయాలు వాడుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ కొందరు మాత్రం స్టార్స్ యొక్క బ్యాక్ డ్రాప్ ఉన్నా కూడా వాడుకోవడానికి ఇష్టపడటం లేదు.

ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ను వినియోగించుకోని వారిలో నార్నే నితిన్ ఒకరు. ఈయన జూనియర్ ఎన్టీఆర్ కి స్వయానా బామ్మర్థి అనే విషయం తెల్సిందే. లక్ష్మీ ప్రణతి సోదరుడు అయిన నితిన్ గత ఏడాది తొలి చిత్రం 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' ని మొదలు పెట్టాడు. ఆ సినిమా ప్రారంభం సమయంలో కానీ.. ఆ తర్వాత కానీ ఎప్పుడూ ఎన్టీఆర్ స్పందించలేదు.

నార్నే నితిన్ మొదటి సినిమా శ్రీశ్రీశ్రీ రాజావారు ఇంకా విడుదల అవ్వకుండానే గీతా ఆర్ట్స్ లో మరో సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు. ఎవరి సహకారం లేకుండానే నితిన్ గీతా ఆర్ట్స్ లో రూపొందబోతున్న సినిమా కోసం నిర్వహించిన ఆడిషన్స్ లో పాల్గొని అల్లు అరవింద్ ను మెప్పించాడని తెలుస్తోంది.

ఎన్టీఆర్ ను వాడుకుంటే నార్నే నితిన్ ఇప్పటి వరకు రెండు మూడు సినిమాలు చేసేవాడు. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ ను నితిన్ వాడుకునే ఉద్దేశ్యం తో లేనట్లున్నాడు. అందుకే సొంతంగా సినిమా ఛాన్స్ లు దక్కించుకుంటూ... సొంతంగానే కథలు ఎంపిక చేసుకుంటున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఉన్న గొప్ప అవకాశం ను సద్వినియోగం చేసుకోకుండా నార్నే నితిన్ చాలా కష్టపడుతున్నాడు. ఇండస్ట్రీలో ఎంట్రీకి బ్యాక్ గ్రౌండ్ ను వినియోగించుకున్నా.. ఆ తర్వాత సొంతంగా కష్టపడి స్టార్ డమ్ తెచ్చుకుంటే మంచిది కదా అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. నితిన్ ఇప్పటికైనా తన వద్ద ఉన్న సూపర్ పవర్ ను వినియోగించుకోవాలని కొందరు సూచిస్తున్నారు.

Tags:    

Similar News