నేషనల్ అవార్డ్.. చరణ్ 2 సార్లు మిస్

తండ్రికి సొంతం కానీ నేషనల్ అవార్డుని రామ్ చరణ్ దక్కించుకుంటాడనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

Update: 2023-08-25 03:48 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెగా వారసత్వాన్ని మరింత ముందుకి తీసుకొని వెళ్తున్నాడు. సినిమా సినిమాకి నటుడిగా తనలో వస్తున్న పరిణితిని చెర్రీ చూపిస్తూనే ఉన్నాడు. మెగాస్టార్ బ్రాండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సెకండ్ సినిమా మగధీరతోనే స్టార్ అనిపించుకున్నాడు. అయితే కెరియర్ లో ఎక్కువగా కమర్షియల్ హిట్స్ తోనే ట్రావెల్ చేసిన చరణ్ రంగస్థలం మూవీతో కంప్లీట్ గా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు.

ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడమే కాకుండా నటుడిగా రామ్ చరణ్ పై అద్భుతమైన ప్రశంసలు అందించింది. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ కాకుండా పక్కాగా క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో చెర్రీ సక్సెస్ అయ్యాడు. ఆ సినిమాలో బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం 2018లో జాతీయ స్థాయిలో పోటీ పడ్డాడు. అయితే ఆ రేసులో బాలీవుడ్ హీరో ఆయుష్మాన ఖురానాకి ఉత్తమ్ నటుడు అవార్డు వరించింది.

అలా మొదటిసారి నేషనల్ అవార్డుని రామ్ చరణ్ జస్ట్ మిస్ చేసుకున్నారు. మరల 2021కి గాను ఆర్ఆర్ఆర్ లో రామరాజు పాత్ర కోసం బెస్ట్ యాక్టర్ రేసులో పోటీ పడ్డాడు. రామరాజు క్యారెక్టర్ ఆర్క్ చాలా అద్భుతంగా ఉంటుంది. జేమ్స్ కామెరూన్ లాంటి వారి ఆ పాత్రచేసిన చరణ్ పై ప్రశంసలు కురిపించారు. బలమైన ఎమోషన్ ని అద్భుతంగా పండించారని అభినందించారు.

అయితే ఈ సారి పోటీలో మెగా హీరో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రకి నేషనల్ అవార్డు వరించింది. పుష్పరాజ్ పాత్ర ప్రపంచస్థాయిలో మెజారిటీ ఆడియన్స్ కి రీచ్ అయ్యింది. అలా రామరాజు పాత్రతో అవార్డుకి అడుగుదూరంలో చరణ్ ఆగిపోయాడు. మున్ముందు చరణ్ ఇలాంటి బలమైన పాత్రలని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తే కచ్చితంగా తండ్రికి సొంతం కానీ నేషనల్ అవార్డుని రామ్ చరణ్ దక్కించుకుంటాడనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

ఏది ఏమైనా ఈ సారి నేషనల్ అవార్డులు మెజారిటీగా తెలుగు సినిమాలకి రావడం ఒక గర్వకారణమైన విషయం అని చెప్పొచ్చు. ఈ ప్రోత్సాహం భవిష్యత్తులో టాలీవుడ్ నుంచి మరిన్న అద్భుతమైన కళాత్మక చిత్రాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే భీమ్, రామరాజు, పుష్పరాజ్ లాంటి అద్భుతమైన పాత్రలని మన దర్శకులు సృష్టించడానికి ఛాన్స్ లభించినట్లు అయ్యింది.

Tags:    

Similar News