యానిమల్ లాంటి కల్ట్ మూవీలు చేస్తా - నాని

నేచురల్ స్టార్ నాని తన కెరియర్ లో సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు

Update: 2023-12-03 07:09 GMT

నేచురల్ స్టార్ నాని తన కెరియర్ లో సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న నాని తాజాగా హాయ్ నాన్నతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. దసరాలో కంప్లీట్ మాస్ కల్ట్ ని టచ్ చేసిన నాని హాయ్ నాన్నలో తండ్రి కూతుళ్ళ ఎమోషన్స్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు.

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ కి పాజిటివ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యే కాన్సెప్ట్, ఒక తండ్రి ఎమోషన్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉండటం వలన కచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన కెరియర్, సినిమాల సంగతి ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చారు.

తన కెరియర్ లో స్టార్ దర్శకులతో సినిమాలు చేయలేకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవని, కేవలం టైం సెట్ కాకపోవడంతోనే కుదరడం లేదని క్లారిటీ ఇచ్చారు. పెద్ద దర్శకులతో అనుకున్న సినిమాలు కూడా కొన్ని టైం గ్యాప్ వలన సెట్స్ కి వెళ్లలేదని చెప్పారు. కొత్త దర్శకులు తీసుకొచ్చిన కథ నచ్చితే హోల్డ్ లో పెట్టే ప్రయత్నం మాత్రం చేయను. కచ్చితంగా వారిని నమ్ముతాను. దానికి తన లైఫ్ లో పేస్ చేసిన సంఘటనలు కూడా కారణం అని అన్నారు.

అలాగే యానిమల్ లాంటి కల్ట్ కథలు తన దగ్గరకి వస్తే కచ్చితంగా చేస్తానని, అయితే తనకు తానుగా ఏ దర్శకుడిని అప్రోచ్ అయ్యి సినిమా చేద్దామని చెప్పనని, దర్శకులు ఎవరైనా వారు రాసుకున్న కథకి నేను సరిపోతానని డిసైడ్ అయ్యి నా దగ్గరకి వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పారు. తన ఫేవరేట్ డైరెక్టర్ మణిరత్నంని కూడా సినిమా చేయాలని ఉందని అడగనని క్లారిటీ ఇచ్చారు.

కాంబినేషన్స్ చూసుకొని సినిమాలు చేసే ప్రయత్నం చేస్తే నా కెరియర్ లో మైల్ స్టోన్ లాంటి సినిమాలు ఉండేవి కావని చెప్పుకొచ్చారు. తన నుంచి డిఫరెంట్ సినిమాలు రావాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అలాగే తాను చేయబోయే సినిమాలు ఇకపై నాలుగు, ఐదు భాషలలో ప్రేక్షకులకి రీచ్ అయ్యే విధంగా ఉండేలా కథలు ఎంపిక చేసుకుంటానని, తన సినిమాలు చూసే ప్రేక్షకులకి బెస్ట్ వెర్షన్ ఇవ్వడానికి తాను ఇలాంటి కథలు చెప్పాలని డిసైడ్ అయినట్లు చెప్పారు.

Tags:    

Similar News