నాని మైండ్ బ్లోయింగ్ లైనప్.. దర్శకుల లిస్టు పెద్దదే

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో టైర్ 2 హీరో ఇమేజ్ నుంచి స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యే పనిలో ఉన్నాడు

Update: 2024-01-31 05:01 GMT

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో టైర్ 2 హీరో ఇమేజ్ నుంచి స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యే పనిలో ఉన్నాడు. వరుసగా సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. గత ఏడాది నాని నుంచి వచ్చిన దసరా, హాయ్ నాన్న సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాది వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేస్తోన్న సరిపోదా శనివారం ఆగస్టులో రిలీజ్ కావడానికి సిద్ధం అవుతోంది.

దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ పై నాని ఇప్పటి వరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ లైన్ లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. నానితో కొత్త కంటెంట్ చెప్పొచ్చు అనుకునే ప్రతి దర్శకుడు అతని డేట్స్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడున్న వారిలో సుజిత్ నానితో నెక్స్ట్ మూవీ కోసం టాప్ రేసులో ఉన్నాడు. ఓజీ మూవీ రిలీజ్ కాగానే నానితో మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీతో సినిమా చేయడానికి సుజిత్ సిద్ధంగా ఉన్నాడు. నిర్మాత కూడా ఫైనల్ అయ్యాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నెక్స్ట్ మూవీ నానితో చేయాలని అనుకుంటున్నారంట. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రావాలని ప్లానింగ్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కూడా నాని కోసం ఒక కథ సిద్ధం చేసుకున్నాడు. అతని డేట్స్ ఇస్తే సెట్స్ పైకి వెళ్తామని వెయిటింగ్ లో ఉన్నారు. అలాగే తమిళ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి కూడా ఇప్పటికే నానికి ఒక కథ చెప్పి లాక్ చేయించుకున్నాడంట.

దసరాతో నేచురల్ స్టార్ నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదేల ఇంటరెస్టింగ్ స్టోరీలైన్ ని మళ్ళీ నానికి చెప్పి ఒకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పైన శ్రీకాంత్ వర్క్ చేస్తున్నాడంట. అలాగే బలగం మూవీతో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు కూడా నానితో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రొడ్యూసర్ గా దిల్ రాజు సిద్ధంగా ఉన్నారు. డేట్స్ దొరకగానే సినిమా సెట్స్ పైకి వెళ్తుందంట.

అలాగే శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 మూవీ కూడా నాని చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా రావడానికి కనీసం రెండేళ్లు పట్టొచ్చు. ఈ లోపు శైలేష్ కొత్త కథలతో వేరొక హీరోలతో మూవీస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా నాని ఇప్పుడు టాలీవుడ్ లో అటు నిర్మాతలకి, ఇటు దర్శకులకి మంచి ఛాయస్ గా మారిపోయాడు. దానికి కారణం అతని సినిమాలకు జరుగుతున్న బిజినెస్ అని చెప్పొచ్చు.


Tags:    

Similar News