రెండేళ్లు డిప్రెష‌న్ లో న‌వీన్ చంద్ర‌!

'అందాల రాక్ష‌సి'తో హీరోగా ప‌రిచ‌య‌మైన న‌వీన్ చంద్ర సుప‌రిచితుడే. తొలి సినిమాతోనే అంద‌గా డిగా..అమ‌ర ప్రేమికుడిగా మార్కులు కొట్టేసాడు. ఇండ‌స్ట్రీలో మంచి భ‌విష్య‌త్ ఉన్న స్టార్ గా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్నాడు.

Update: 2023-09-27 03:45 GMT

'అందాల రాక్ష‌సి'తో హీరోగా ప‌రిచ‌య‌మైన న‌వీన్ చంద్ర సుప‌రిచితుడే. తొలి సినిమాతోనే అంద‌గా డిగా..అమ‌ర ప్రేమికుడిగా మార్కులు కొట్టేసాడు. ఇండ‌స్ట్రీలో మంచి భ‌విష్య‌త్ ఉన్న స్టార్ గా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్నాడు. ఆ త‌ర్వాత అవ‌కాశాలు బాగానే వ‌చ్చాయి. కానీ వైఫ‌ల్యాలు మాత్రం న‌వీన్ ని రేసులో పూర్తిగా వెన‌క్కి నెట్టేసాయి. స్టోరీల ఎంపిక‌లో వైఫ‌ల్యం చెంద‌డంతో అవి ప‌రాజ‌యం చెంద‌డంతో న‌వీన్ పేరు మ‌ర్చిపోయేలా చేసాయి. ఒక్క సినిమాతోనే వ‌చ్చిన గుర్తింపు ఒక్క‌సారిగా కొవ్వొత్తులా క‌రిగిపో యింది.

కోలీవుడ్ లోనూ చాలా సినిమాలు చేసాడు. అక్క‌డా స‌క్సెస్ అవ్వ‌లేదు. దీంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట‌ల్ గానూ ట‌ర్నింగ్ తీసుకున్నాడు. విల‌న్ గానూ న‌టించాడు. కానీ హీరో అనే ఇమేజ్ ముందు ఇవ‌న్నీ ఏ పాటి రోల్స్ ? దీనికి తోడు కెరీర్ ఆరంభంలోనే హీరోపై కొంత నెగిటివిటీ కూడా వినిపించింది. దీంతో న‌వీన్ కెరీర్ పూర్తిగా గాడి త‌ప్పింది. ఖాళీ లేకుండా సినిమాలైతే చేస్తున్నాడు గానీ..తాను అనుకున్న గుర్తింపు అయితే ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో హీరో ఒకానొక స‌మ‌యంలో డిప్రెష‌న్ కి గురైన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని న‌వీన్ చంద్ర 'మంథ్ ఆఫ్ మధు' సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా రివీల్ చేసారు.

'మా నాన్న ఆర్టీసీలో మెకానిక్ గా చేసేవారు. నాకు మొదటి నుంచి సినిమాల పిచ్చి ఎక్కువ‌గానే ఉండేది. అదే నన్ను ఇంత‌దూరం ప్ర‌యాణం చేసేలా చేసింది. న‌ట‌న‌కంటే ముందు నాకు డాన్సు బాగా తెలుసు. ఆ త‌ర్వాత నాకు అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుల వ‌ల్ల న‌ట‌న నేర్చుకోగ‌లిగాను. అయితే ఒకానొక స్టేజ్ లో కెరీర్ ఎలా వెళ్తుంతో నాకే అర్దం కాలేదు. ఇండ‌స్ట్రీలో ఎలాంటి స‌పోర్ట్ లేదు. నిల‌దొక్కుకోవ‌డం క‌ష్ట‌మైంది.

దాంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. డిప్రెష‌న్ నుంచి బయటికి రావడానికి రెండేళ్లు స‌మ‌యం పట్టింది. అప్ప‌టి నుంచి న‌న్ను నేను క‌రెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. గ‌తంలో చేసిన త‌ప్పిదాలు మ‌ళ్లీ రిపీట్ కాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాను' అని అన్నారు.

Tags:    

Similar News